మారుతి డైరెక్షన్‌లో కౌషల్‌ హీరోగా సినిమా.?

మరిన్ని వార్తలు

కౌషల్‌ హీరోగా సినిమా తెరకెక్కించేందుకు దర్శకుడు, నిర్మాత, రచయిత మారుతి సన్నాహాలు చేస్తున్నాడట. మరో రచయిత కూడా కౌషల్‌తో సినిమా కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రస్తుతానికి అయితే మారుతి - కౌషల్‌ కాంబినేషన్‌లో సినిమాపై కొంచెం ఎక్కువ క్లారిటీ కనిపిస్తోంది. 

బిగ్‌బాస్‌ రియాల్టీ షో ఫైనల్‌ సందర్భంగా మీడియాలో జరిగిన చర్చా కార్యక్రమాల్లో మారుతి పాల్గొన్నాడు. కౌషల్‌కి బెస్ట్‌ విషెస్‌ చెప్పాడు. కౌషల్‌ గెలుస్తాడని అంచనా వేశాడు మారుతి. ఆ అంచనా నిజమైంది. కౌషల్‌ గెలిచిన తర్వాత టాలీవుడ్‌ నుండి కౌషల్‌కి ఫస్ట్‌ కాల్‌ మారుతిదేనట. కౌషల్‌ని అభినందిస్తూ, ఆ తర్వాత కూడా మారుతి మాట్లాడాడు. 

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు కూడా కౌషల్‌ని అభినందించడమే కాక, కౌషల్‌ గెలవడం తనకెంతో ఆనందాన్నిచ్చిందని చెప్పాడు. ఇలా కౌషల్‌కి పెరిగిన పాజిటివ్‌ ఇమేజ్‌ నేపథ్యంలో అతనితో సినిమా తీసి హిట్‌ కొట్టాలనే ఆలోచనలో మారుతి ఉన్నాడు. తన దగ్గర ఇప్పటికే సిద్ధంగా ఉన్న ఓ కథని కౌషల్‌కి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసే పనిలో మారుతి బిజీగా ఉన్నాడట. ఈ సినిమాకి మారుతి తనదైన స్టైల్‌లో ఓ ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ని ప్లాన్‌ చేశాడని సమాచారమ్‌. 

కొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్ట్‌పై స్పష్టత రాబోతోంది. మరోపక్క కౌషల్‌ని సినిమా ఆఫర్స్‌ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కౌషల్‌ మాత్రం మంచి కథ కోసం ఎదురు చూస్తున్నాడు. టైం తీసుకున్నా సరైన హిట్‌ కొడితేనే బిగ్‌బాస్‌ ద్వారా వచ్చిన పాపులారిటీకి న్యాయం చేసినట్లవుతుందని కౌషల్‌ భావిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS