బిగ్ బాస్ లో ప్రతి శనివారం ఇంటిలోని ఒక సభ్యుడితో షో చూస్తున్న వీక్షకుల నుండి ఒకరు ఫోన్ చేసి మాట్లాడే అవకాశాన్ని కలిపించడం జరుగుతుంది.
అందులో భాగంగానే ఈ వారం ఆ అవకాశం కౌశల్ కి దక్కింది. శేఖర్ అనే వ్యక్తి కౌశల్ తో మాట్లాడుతూ- “అన్న మీకు బయట చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, అందరం కలిసి దానికి కౌశల్ ఆర్మీ అని పేరు కూడా పెట్టుకున్నాము. నువ్వు జాగ్రత్తగా తప్పులు చేయకుండా గేమ్ ఆడు, నాని అన్న చెప్పే సలహాలని పాటించు నువ్వు కచ్చితంగా గెలవాలి.. గెలుస్తావు అన్న నమ్మకం నాకుంది".
ఈ ఫోన్ కాల్ కౌశల్ కి చాలా ధైర్యాన్ని ఇచ్చింది అని చెప్పాలి. బిగ్ బాస్ ఇంటిలో తనకి ఎవ్వరి సపోర్ట్ లేదని, తనని ఒంటరిని చేశారు అని తోటివారితో చెప్పడం చూశాము. ఒకరకంగా దీనివల్లే ఆయనకి ఆడియన్స్ లో కూడా అనూహ్యమైన సపోర్ట్ కూడా వచ్చింది.
ఇప్పుడు ఇక అంతర్జాలంలో హల్చల్ చేస్తున్న కౌశల్ ఆర్మీ గురించి సదరు వ్యక్తి ఫోన్ కాల్ లో చెప్పడంతో తనకి బయట ఉన్న మద్దతుని ఒక అంచనా వేయగలడు అని అతని తెలివితేటలు, సమయస్పూర్తి చూస్తే మనకి అర్ధమవుతుంది.
ఈ గేమ్ లో గెలవడానికి తాను ఎల్లప్పుడు ఫోకస్ గా ఉంటాను అని చెప్పి కౌశల్ కి ఈ ఫోన్ కాల్ మరింత బలాన్నిచ్చింది అని చెప్పాలి.