ఏంటీ.! కౌషల్‌ - తనీష్‌ కొట్టుకుంటారా?

మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌లో వాతావరణం మరింత వేడెక్కింది. నోటి మాటలతో మొదలైనే గొడవలు కాస్తా ముదిరి ఫిజికల్‌ ఎటాక్స్‌ వరకూ వెళ్లినట్లు కనిపిస్తోంది. కౌషల్‌ - తనీష్‌ ఇద్దరూ నువ్వా నేనా? ఏంటంటే ఏంటి? అనుకునే వరకూ వెళ్లారు. కరెక్ట్‌గా అక్కడ కట్‌ చేసి, ప్రోమో వదిలారు. దాంతో బిగ్‌బాస్‌ వీక్షిస్తున్న ప్రేక్షకుల్లో మరింత ఉత్కంఠ మొదలైంది. 

డే 1 నుండీ కౌషల్‌ని ఒక్కడినే టార్గెట్‌ చేసి, హౌస్‌మేట్స్‌ చేస్తున్న టార్చర్‌ ప్రేక్షకులంతా చూస్తున్నారు. ముఖ్యంగా తనీష్‌, కౌషల్‌ పట్ల మొదటి రోజు నుండీ యాంటీగానే ఉన్నాడు. ఆయన మాటలను అడ్డదిడ్డంగా అర్ధం చేసుకుంటూ, అనవసర ఉద్వేగాలకు లోనవుతూ వస్తున్నాడు. 100 రోజులుగా బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్‌బాస్‌ షో ఇప్పుడు క్లైమాక్స్‌కి చేరింది. టాప్‌ 5లో ఎవరు నిలుస్తారనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. సీజన్‌ మొత్తానికి నామినేట్‌ అయిన కౌషల్‌, కౌషల్‌ ఆర్మీ పుణ్యమా అని ప్రతీ వీక్‌ ఎలిమినేషన్‌ నుండి గట్టెక్కుతూనే ఉన్నాడు.

 

ఇకపోతే ఈ వారం నామినేషన్స్‌లో అనుకోని ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఆల్రెడీ నామినేషన్‌లో ఉన్న కౌషల్‌ని మినహాయిస్తే, మిగిలిన హౌస్‌ మేట్స్‌ని బిగ్‌బాస్‌ డైరెక్ట్‌గా నామినేట్‌ చేసేశారు. ఫైనల్‌ నామినేషన్స్‌లోని ఫైనల్‌ ట్విస్ట్‌ ఇది. హౌస్‌మేట్స్‌ అంతా నామినేట్‌ కావడానికి కౌషల్‌ చేసిన తప్పే కారణమంటూ తోటి సభ్యులు ఆయన్ని నిందించడం, ఈ రోజు టాస్క్‌లో భాగంగా కౌషల్‌ - తనీష్‌ మధ్య జరగబోయే వార్‌ ఇవన్నీ ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే బిగ్‌బాస్‌ షోపై మరింత ఇంట్రెస్ట్‌ చూపిస్తోంది. 

ఇంతకీ కౌషల్‌, తనీష్‌ నిజంగానే కొట్టుకుంటారో లేదో చూడాలంటే నైట్‌ 9.30 గంటల వరకూ ఆగాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS