ఫెస్టివల్‌ హీరో శర్వానంద్‌ ఎక్కడ.?

మరిన్ని వార్తలు

ప్రతీ పండక్కీ ఓ సినిమాతో వచ్చి పెద్ద హీరో, చిన్న హీరో అనే తేడా లేకుండా సైలెంట్‌గా పోటీకొచ్చి అంతే సైలెంట్‌గా హిట్‌ పట్టుకెళ్లిపోతాడు శర్వానంద్‌. గతేడాది ఏకంగా మెగాస్టార్‌ చిరంజీవి 'ఖైదీ'తో పోటీ పడి, బాక్సాఫీస్‌ వద్ద తన సత్తా చాటాడు శర్వానంద్‌. ఈ ఏడాది 'మహానుభావుడు' సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ రాజువయ్యా అనిపించుకున్నాడు. 

ఇప్పుడు దసరాకి 'పడి పడి లేచె మనసు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ ఈ సినిమాకి సంబంధించి ఫ్రెష్‌ అప్‌డేట్స్‌ ఏమీ రివీల్‌ కావడం లేదింతవరకూ. ఎక్కడా ఈ సినిమా సందడి కనిపించడం లేదు. హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 'ఫిదా' బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంతవరకూ ఏ హడావిడి లేకపోయినా, మనోడికి అలవాటేగా సైలెంట్‌గా రావడం. అలాగే దసరాకి ఈ సినిమా విడుదలకు తెర వెనక ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. 

కాగా శర్వానంద్‌ హీరోగా మరో రెండు ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో నితిన్‌తో ఓ మల్టీ స్టారర్‌లో శర్వానంద్‌ నటించాల్సి ఉంది. 'దాగుడుమూతలు' అనే టైటిల్‌ని ఈ సినిమాకి ఫిక్స్‌ చేశారు కూడా. అయితే ఎందుకో ఈ సినిమా పట్టాలెక్కేందుకు జాప్యం అవుతోందనీ ఫిల్మ్‌ నగర్‌లో టాక్‌ ప్రచారంలో ఉంది. 

ఇదిలా ఉంటే, తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్‌ శర్వా ఖాతాలో పడింది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాని గీతా ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తోంది.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS