కౌషల్‌ ఖాతాలో రెండు పెద్ద సినిమాలు.!

మరిన్ని వార్తలు

ఓ రచయిత కమ్‌ నిర్మాత కౌషల్‌కి తన సినిమాలో బిగ్‌ ఆఫర్‌ ఇచ్చాడట. బిగ్‌బాస్‌ విన్నర్‌ కౌషలే అవుతాడని ఆ నిర్మాత ముందే ఊహించాడట. మరో దర్శకుడు కమ్‌ నిర్మాత కమ్‌ రచయిత కూడ బిగ్‌బాస్‌ విన్నర్‌ కౌషల్‌ అని బిగ్‌బాస్‌ నిర్వాహకులు అనౌన్స్‌ చేయడానికి ముందే మీడియా సమక్షంలో తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. ఈ దర్శకుడే ఆల్రెడీ కౌషల్‌ కోసం స్క్రిప్టు ప్రిపేర్‌ చేశాడట. 

గతంలో కౌషల్‌ కొన్ని సినిమాల్లో నటించాడు. మహేష్‌బాబు హీరోగా తెరంగేట్రం చేసిన 'రాజకుమారుడు' చిత్రంలో కౌషల్‌ ఓ చిన్న పాత్రలో కనిపించాడు. తర్వాత ఉదయ్‌ కిరణ్‌ హీరోగా తెరకెక్కిన 'శ్రీరామ్‌' సినిమాలోనూ కౌషల్‌ నటించాడు. ఇప్పుడు బుల్లితెరపై పలు సీరియల్స్‌లో నటిస్తున్నాడు. బిగ్‌బాస్‌ షోకి ముందు కౌషల్‌ అంటే ఎవ్వరికీ తెలియదు. 

బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాక, డే 1 నుండీ ఆయన వ్యక్తిత్వానికి అంతా ఫిదా అయిపోయారు. హౌస్‌లో మిగిలిన తోటి కంటెస్టెంట్లు తనని ఎంత వేధించినా, ఏమాత్రం ఓర్పును కోల్పోకుండా, గేమ్‌ని గేమ్‌లా ఆడి ఎవరెన్ని విధాలుగా ఆయన్ని కృంగదీసినా ఏమాత్రం చలించకుండా, లక్ష్యాన్ని మాత్రమే మనసులో నిలుపుకుని, ఆ లక్ష్యం కోసం పట్టుదలతో కృషి చేసి, చివరికి బిగ్‌బాస్‌ విజేతగా నిలిచాడు. 

బిగ్‌బాస్‌ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో అభిమానుల మద్దతు కూడగట్టుకున్నాడు కౌషల్‌. ఇప్పుడు కౌషల్‌కున్న క్రేజ్‌తో ఆయనను హీరోగా సినిమాలు తీసేందుకు దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారట. అతి త్వరలోనే కౌషల్‌ హీరోగా పైన చెప్పిన రెండు సినిమాలు పట్టాలెక్కనున్నాయని తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS