బిగ్‌బాస్‌లోకి వైల్డ్ కార్ట్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ పూజా రామచంద్రన్ రావడంతోనే హౌస్‌ని హీటెక్కించేసింది. ఎవరికీ తెలియకుండా అర్ధరాత్రి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పూజా రామచంద్రన్ తెల్లారేసరికి అందరికీ షాక్ ఇచ్చింది. షాక్ అంటే అలాంటి ఇలాంటి షాక్ కాదు మరి. తేజును తలపుకు తీసుకొచ్చింది హాట్‌నెస్‌లో. తేజుని మించిపోయింది. థైస్ కనిపించేలా షార్ట్ నైట్ డ్రస్సులో అందరికీ గుడ్‌మార్నింగ్ చెప్పింది.
ఇకపోతే, హౌస్‌లో మోస్ట్ డామినేటింగ్ కంటెస్టెంట్‌గా ఉండే తేజస్విని లేని లోటును పూర్తిగా తేజు యాంగిల్ నుండి కాకపోయినా, గ్లామర్ యాంగిల్ నుండి కొంచెమైనా పూజ భర్తీ చేసేలానే కనిపిస్తోంది. అయితే హౌస్ నుండి బయటికి వచ్చిన తేజు ఆరోపణల పర్వం కొనసాగిస్తూనే ఉంది. బయటికి వెళ్తానని ఆమె అస్సలు ఊహించలేదు. లోపలికి వెళ్లే ముందు ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తా.. అందరినీ ఓ ఆట ఆడిస్తా అని ఛాలెంజ్ చేసి వెళ్లిన తేజు తన పర్సనల్ లైప్‌ని డ్యామేజ్ చేసుకుని బయటికి వచ్చింది. అయినా ఏమీ చలించదట. పబ్లిసిటీ అంటే పబ్లిసిటీనే. అది నెగిటివ్ అయినా, పోజిటివ్ అయినా, తనకి యాక్సెప్టెడే అంటోంది తేజు.
ఇదిలాఉంటే, నెక్స్ట్ బిగ్‌బాస్‌లోకి, ఇంతవరకూ ఎలిమినేట్ అయిన వారిలో నుండి ఎవరో ఒకరికి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వారిలో భానుశ్రీ, నూతన్ నాయుడు, తేజు, శ్యామల ఉన్నారు. వీరిలో భాను, నూతన్ నాయుడు ఎక్కువ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.
చూడాలి మరి వీరిలో బిగ్‌బాస్ రీ ఎంట్రీ ఛాన్స్ ఎవరిని వరిస్తుందో.!