ఈ మధ్యకాలంలో చాలా మంది ప్రముఖ హీరోలు, నటులు వెండితెర నుండి డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ పైకి తమ మనసుని మళ్ళిస్తున్నారు. ఇప్పుడు అదే జాబీతలోకి ప్రముఖ హీరో కౌశిక్ బాబు కూడా చేరిపోయారు.
తాజాగా ఆయన ఒక షార్ట్ ఫిలిం ద్వారా డిజిటల్ మీడియంలోకి అడుగుపెట్టాడు. అయితే ఈమధ్య కాలంలో వస్త్తున్న రెగ్యులర్ షార్ట్ ఫిలిమ్స్ కథలాంటిది ఇది కాకపోవడం గమనార్హం. ఇక ఈ షార్ట్ ఫిలిం కథ విషయానికి వస్తే- విపత్కర పరిస్థితులలో సైతం ఒక మిలిటరీ ఆఫీసర్ తన కుటుంబం కన్నా తన దేశానికే మొదటి ప్రాధాన్యత ఎలా ఇచ్చాడు? ఆ మిలిటరీ అధికారి ఎదురుకున్న ఆ విపత్కర పరిస్థితి ఏంటి? అన్నది ఈ షార్ట్ ఫిలిం యొక్క కథ.
ఇప్పటికే పలు వైవిధ్యమైన పాత్రలని వెండితెర పైన పోషించిన కౌశిక్ బాబు, ఇప్పుడు తన తొలి షార్ట్ ఫిలిం కి ఒక మిలిటరీ అధికారి పాత్ర ఎంచుకోవడం నిజంగా అభినందించాల్సిన విషయమే. ఇక ఈ లఘు చిత్రాన్ని తోట మల్లికార్జున్ రచించి-దర్శకత్వం వహించగా, తోట క్రియేటివ్ వర్క్స్ పైన పాండు రంగయ్య దీనిని నిర్మించారు.
ఒక మంచి సందేశం తో తీసిన ఈ లఘు చిత్రం రేపు iQlik YouTube Channel లో విడుదల కానుంది. భారతదేశ సరిహద్దులని రక్షిస్తున్న భారత సైన్యానికి ఈ చిత్రాన్ని అంకితం ఇచ్చాడు దర్శకుడు.
ఇంతకి ఈ లఘు చిత్రం పేరు చెప్పలేదు కదా... “ఫౌజీ”.