చందమామ చేతిలోనే ఆ యంగ్‌హీరో భవితవ్యం.!

By iQlikMovies - December 12, 2018 - 11:12 AM IST

మరిన్ని వార్తలు

సీనియర్‌ హీరోయిన్‌ అయినా స్టార్‌డమ్‌తో సంబంధం లేకుండా యంగ్‌ హీరోస్‌, స్టార్‌ హీరోస్‌ అనే తేడా లేకుండా చందమామ కాజల్‌ వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఇటీవల యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో 'కవచం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాలో కాజల్‌ పాత్రకు మరీ అంతగా ప్రాధాన్యత లేకపోయింది. జస్ట్‌ హీరోయిన్‌గా గ్లామర్‌ పాత్రనే పోషించింది కాజల్‌. కానీ ఇదే హీరోతో మరో సినిమాలోనూ కాజల్‌ నటిస్తోంది. తేజ డైరెక్షన్‌లో ఆ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో తేజ, కాజల్‌ పాత్రను విభిన్నంగా తీర్చి దిద్దాడట. సినిమా అంటే తెలియని తనకు సినిమాతో పరిచయం ఏర్పర్చిన డైరెక్టర్‌ తేజ.

 

తేజ డైరెక్షన్‌లో అప్పుడెప్పుడో వచ్చిన 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతోనే ఈ అందాల చందమామ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైంది. అలాంటి తేజ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే, హీరోయిన్‌గా తన స్టార్‌డమ్‌ని పక్కన పెట్టి 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో రానాతో జత కట్టింది. కాజల్‌ పుణ్యమా అని ఆ సినిమా మంచి విజయం దక్కించుకోవడంతో పాటు, జనం మర్చిపోయిన తేజ పేరు మళ్లీ మార్మోగింది. అందుకే తేజ మళ్లీ అదే ఫార్ములాని ఫాలో చేయనున్నాడట. తన తాజా చిత్రంలో కాజల్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇవ్వనున్నాడట. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో 'రాణి'గా హీరోతో సమానంగా ఇంపార్టెంట్‌ రోల్‌ పోషించింది.

 

ఇప్పుడు తేజ తన కొత్త సినిమాకి 'సీత' అనే హీరోయిన్‌ సెంట్రిక్‌ టైటిల్‌ని ప్లాన్‌ చేస్తున్నాడనీ సమాచారమ్‌. ఆ సీత పాత్రలోనే కాజల్‌ నటిస్తుంది. సీత పాత్రని చాలా ఉన్నతంగా బిల్డప్‌ చేయనున్నాడట. సో మరోసారి తేజ, కాజల్‌ పేరు చెప్పి మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకోనున్నాడేమో చూడాలి. మరోవైపు స్టార్‌డమ్‌కి మించి భారీ బడ్జెట్‌ సినిమాల్లో నటిస్తున్నా బెల్లంకొండకు కూడా ఆశించిన స్థాయిలో విజయం అందడం లేదు. అయితే 'సీత' రూపంలోనైనా బెల్లంకొండ బ్లాక్‌ బస్టర్‌ కొడతాడేమో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS