బెల్లంకొండ శ్రీ‌నివాస్ 'క‌వ‌చం' రిలీజ్ డేట్ ఫిక్స్..!

By iQlikMovies - November 28, 2018 - 15:56 PM IST

మరిన్ని వార్తలు

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్, కాజ‌ల్, మెహ్రీన్ ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో వ‌స్తున్న‌ సినిమా క‌వ‌చం. ఈ చిత్రం డిసెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది. టీజ‌ర్ 10 మిలియన్ డిజిటల్ వ్యూస్ అందుకుని.. అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ తో శ్రీ‌నివాస్ మామిళ్ళ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు.

కెరీర్‌లో తొలిసారి ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. హర్షవ‌ర్ధ‌న్ రానే, బాలీవుడ్ న‌టుడు నీల్ నితిన్ ముఖేష్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే క‌వ‌చం షూటింగ్ పూర్తైంది.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి.

ఎస్ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా.. ఛోటా కే నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. వంశ‌ధార క్రియేష‌న్స్ సంస్థ‌లో న‌వీన్ సొంటినేని(నాని) క‌వ‌చం సినిమాను నిర్మిస్తున్నారు.

- ప్రెస్ రిలీజ్


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS