కోవిడ్ తో పోరాటం చేసే వాళ్లకు ప్లాస్మాదాతల అవసరం చాలా ఉంది. కోవిడ్ తో పోరాడి, విజయం సాధించినవాళ్లే ప్లాస్మా దానం చేయడానికి అర్హులు. అందుకే ప్లాస్మా దానం చేయమంటూ.. స్టార్లు కాంపెయినింగ్ చేస్తున్నారు. ఇటీవల రాజమౌళి కుటుంబాన్ని సైతం కరోనా కబళించిన సంగతి తెలిసిందే. వాళ్లంతా ఇప్పుడు కోలుకుని ప్లాస్మా డొనేట్ చేస్తున్నారు. తొలుతు రాజమౌళి, కాలభైరవ ప్లాస్మా ఇచ్చారు.
రాజమౌళి కూడా ప్లాస్మా ఇవ్వాల్సిందే. కానీ... ఐజీజీ లెవల్స్ చాలా తక్కువగా ఉన్నాయని వైద్యులు నిర్దారించారు. దాంతో.. ప్లాస్మా ఇవ్వడం కుదర్లేదు. కీరవాణి, కాలభైరవ ప్లాస్మా డొనేట్ చేస్తున్న చిత్రాల్ని రాజమౌళి తన సోషల్ మీడియా లో ఉంచారు. ప్లాస్మా దాతలు ముందుకు రావాలని, కోవిడ్ తో పోరాటం చేస్తున్నవాళ్లని ఆదుకోవాలని ఈ మేరకు పిలుపునిచ్చారు రాజమౌళి.