'వర్మని అంత తేలిగ్గా తీసి పారేయడానికి లేదు. వర్మ ఎప్పుడు ఎలాంటి హిట్ ఇస్తాడనేది చెప్పలేం. 'ఆఫీసర్' సినిమాతో వర్మ ఈజ్ బ్యాక్..' అని ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి అన్నారు. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆఫీసర్' ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్‌కి విచ్చేసిన కీరవాణి, వర్మనుద్దేశించి ఈ పలుకులు పలికారు. అంతేకాదు, 'వర్మకి తాను 'శివ'లాంటి బ్లాక్ బస్టర్ ఇస్తే, వర్మ తనకు అమలనిచ్చాడు..' అంటూ నాగార్జున వర్మ కారణంగా తనకు భార్యగా అమల దక్కిందని అప్పటి సంగతులను గుర్తు చేసుకున్నాడు.
వీరిద్దరి కాంబినేషన్లో దాదాపు 28 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా 'ఆఫీసర్'. యాక్షన్ ప్యాక్డ్ పవర్ఫుల్ స్టోరీ ఇది. ఓ పాపని కాపాడే నేపథ్యంలో నాగార్జున చేసే సాహసాల ఘట్టమే 'ఆఫీసర్'. పాప సెంటిమెంట్, భారీ భారీ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ సినిమాని వర్మ తన సొంత నిర్మాణ సంస్థ అయిన కంపెనీలో నిర్మిస్తున్నాడు. అందాల భామలను ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో వర్మ సిద్ధహస్థుడు. అంతేకాదు, వర్మ పరిచయం చేసిన ముద్దుగుమ్మలు తర్వాత స్టార్ హీరోయిన్లుగా వెలిగిపోతారనడం కూడా నిరూపితమైన అంశమే. అలా ఇప్పుడు మిరా సరీన్ అనే కొత్త భామని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు వర్మ.
ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాకే యాక్టింగ్ టాలెంట్‌లో తానేంటో నిరూపించేసుకుందట. నాగార్జునతో కలిసి యాక్షన్ సీన్స్‌లో పోటీపడి నటించేసిందట. జూన్ 1న 'ఆఫీసర్' ప్రేక్షకుల ముందుకు రానుంది.