ఓటీటీ బాట‌లో.. మ‌రో పెద్ద సినిమా

By Gowthami - May 24, 2020 - 11:13 AM IST

మరిన్ని వార్తలు

జూన్ లో షూటింగుల‌కు ప‌ర్మిష‌న్లు ఇచ్చినా థియేట‌ర్లు తెర‌చుకోవ‌డానికి మ‌రో నెల రోజులైనా పడుతుంది. ఆ త‌ర‌వాత కూడా సీటు విడిచి సీటులో కూర్చోడానికే అనుమ‌తులు వ‌స్తాయి. అంటే... స‌గం థియేట‌ర్లే నిండుతాయ‌న్న‌మాట‌. అది కూడా గ్యారెంటీ లేదు. ఈ నేప‌థ్యంలో ఓ టీ టీకే త‌మ సినిమాల్ని అమ్ముకోవ‌డానికి మెగ్గు చూపుతున్నాయి కొన్ని సంస్థ‌లు.

 

వాటిలో కీర్తి సురేష్ సినిమా కూడా చేరిపోయింది. కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో మిస్ ఇండియా సినిమా తెర‌కెక్కుతోంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌పై మ‌హేష్ కోనేరు ఈ సినిమాని తెర‌కెక్కించారు. దాదాపు 10 కోట్ల ఖ‌ర్చ‌య్యాయ‌ట‌. అమేజాన్ సంస్థ ఈ సినిమాని 14 కోట్ల‌కు కొన‌డానికి ముందుకొచ్చింద‌ని స‌మాచారం. అంటే నాలుగు కోట్ల టేబుల్ ప్రాఫిట్‌. అందుకే నిర్మాత‌లు ఈ సినిమాని అమేజాన్‌కి అమ్మాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే.. ఓటీటీ ప్ర‌ద‌ర్శ‌న‌పై ఓ క్లారిటీ రాబోతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS