కీర్తి సురేష్ సినిమాకు సూపర్ ఆఫర్ వచ్చిందిగా!

మరిన్ని వార్తలు

గత ఐదు నెలలుగా సినిమా థియేటర్లు మూతపడటంతో చాలా మంది నిర్మాతలు ఓటీటీ వేదికల ద్వారా తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాలు ఈ విధంగా ఓటీటీ వేదికల ద్వారా డైరెక్ట్ గా విడుదలయ్యాయి. తాజాగా ఈ జాబితాలోకి కీర్తి సురేష్ నటించిన 'మిస్ ఇండియా' కూడా చేరబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చినప్పటికీ తాజాగా ఆ డీల్ కు సంబంధించిన వివరాలు కూడా బయటకు వచ్చాయి.

 

ప్రముఖ ఓటీటీ వేదిక అయిన నెట్ ఫ్లిక్స్ వారు 'మిస్ ఇండియా' సినిమా డైరెక్ట్ రిలీజ్ చేసేందుకు రూ. 10 కోట్లు(Rs.9.5 cr + GST) నిర్మాతలకు చెల్లిస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని నెట్ ఫ్లిక్స్ వారు ప్రకటిస్తారు. ఈ డీల్ తో నిర్మాతలకు మంచి లాభాలు వచ్చినట్టేనని అంటున్నారు. ఎందుకంటే ఈ పది కోట్ల రూపాయలతో పాటు శాటిలైట్ రైట్స్, డబ్బింగ్ రైట్స్ ద్వారా మంచి ఆదాయమే వచ్చిందట. కీర్తి సురేష్ నటించిన సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉండడమే ఈ డిమాండుకు కారణం అంటున్నారు.

 

థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. నూతన దర్శకుడు నరేంద్రనాథ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS