ఇప్పటి హీరోయిన్లు ది దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే టైపు. క్రేజూ, ఇమేజూ ఉండగానే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చూస్తున్నారు. కీర్తి సురేష్ కూడా అదే చేస్తోంది. టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న కథానాయికల్లో కీర్తి ముందు వరుసలోనే ఉంటుంది. వరుసగా ఆమెకు పెద్ద పెద్ద ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవలే కీర్తి మహేష్ సినిమాని ఓకే చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు `వేదాళం` రీమేక్‌లోనూ భాగం పంచుకోనుంది.
చిరంజీవి కథానాయకుడిగా మలయాళ చిత్రం `వేదాళం`ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకుడు. ఈ చిత్రంలో చిరు చెల్లాయిగా కీర్తి పేరు ఖరారైంది. ముందు సాయి పల్లవిని అనుకున్నారు. అయితే కాల్షీట్లు సర్దుబాటు కాకపోవడంతో.. కీర్తిని రంగంలోకి దించుతున్నారు. నిజానికి... ఈ సినిమాలో కీర్తిది తక్కువ నిడివి ఉన్న పాత్రే. కానీ.. భారీ మొత్తం పారితోషికం డిమాండ్ చేసిందని టాక్. హీరోయిన్‌గా ఎంత తీసుకుంటుందో, అంతకంటే కాస్త ఎక్కువగానే పారితోషికం అడిగిందని, కీర్తి క్రేజ్ చూసి చిత్రబృందం కూడా అడిగినంత ఇవ్వడానికి రెడీ అయ్యిందని సమాచారం.