బాలీవుడ్‌లో కీర్తి సురేష్‌కి ఇంకో ఆఫర్‌?

మరిన్ని వార్తలు

సౌత్‌ బ్యూటీస్‌ మీద బాలీవుడ్‌ మేకర్స్‌ బాగా ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు . ఆ క్రమంలోనే ఈ మధ్య చాలా మంది సౌత్‌ భామలు బాలీవుడ్‌కి ఎగుమతి అవుతున్నారు. సినిమాలే కాకుండా, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లోనూ అవకాశాలు దక్కించుకుంటున్నారు. మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అలాగే మన సౌత్‌ భామ ఈ జనరేషన్‌ ‘మహానటి’ కీర్తి సురేష్‌కీ అక్కడ ఓ మంచి అవకాశం దక్కింది. సీనియర్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ నటిస్తున్న ‘మైదాన్‌’ చిత్రంలో కీర్తి హీరోయిన్‌గా ఛాన్స్‌ దక్కించుకుంది. అయితే, కొన్ని కారణా వల్ల కీర్తి ఆ గోల్డెన్‌ ఛాన్స్‌ మిస్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ఛాన్స్‌ పోతేనేమి.. మరో బంపర్‌ ఆఫర్‌ కీర్తిని పలకరించిందట.

 

బాలీవుడ్‌లో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తమ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ని ఎంచుకోవాలనుకుందట. ఆల్రెడీ కీర్తితో సంప్రదింపు కూడా జరిగాయట. ఓ యంగ్‌ హీరో ఈ సినిమాలో నటించబోతున్నాడనీ బాలీవుడ్‌ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు వ్లెలడి కానున్నాయనీ తెలుస్తోంది. మొదటి ఆఫర్‌ మిస్‌ చేసుకున్నా, అంతకు మించిన బెస్ట్‌ ఛాన్స్‌ని కీర్తి మళ్లీ సొంతం చేసుకోబోతోందన్న మాట. ఇదిలా ఉంటే, తెలుగులో కీర్తిసురేష్‌ నటించిన ‘మిస్‌ ఇండియా’ చిత్రం త్వరలో విడుదకు సిద్ధంగా ఉంది. తమిళ, తెలుగు భాషతో కలిపి కీర్తి చేతిలో ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS