రాజమౌళి సినిమా అనగానే దేశం మొత్తం అటువైపే చూడడం మొదలెడుతుంది. పైగా రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల మల్టీస్టారర్ ఇది. తెలుగు సినిమాలకు అచ్చొచ్చిన సంక్రాంతి సీజన్‌లో విడుదల అవుతుంది. అందుకే.. ఈ సినిమాపై అంతులేని బజ్, క్రేజ్. దానికి తగ్గట్టుగానే బిజినెస్ జరిగిపోయింది. ఈ సినిమా విలువ ఇప్పుడు 833 కోట్లు. ప్రపంచ వ్యాప్తంగా, థియేటర్ - నాన్ థియేటరికల్ రైట్స్ రూపంలో ఈ సినిమాకి 833 కోట్లు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు లెక్కగట్టాయి.
నైజాంలో ఈ సినిమాని దిల్ రాజు 75 కోట్లకు కొనుగోలు చేశారని సమాచారం. సీడెడ్ లో 36 కోట్లకు అమ్మేశారు. వైజాగ్ 24 కోట్లు పలికింది. వెస్ట్ గోదావరి 14 కోట్లకు ఫిక్స్ అయ్యింది. తమిళ నాడు నుంచి 80 కోట్ల వరకూ వచ్చాయి. ఓవర్సీస్ 69 కోట్లకు వెళ్లింది. నెల్లూరు 9 కోట్లు, కృష్ణా 15 కోట్లు.. ఇలా ఎక్కడ చూసినా ఆల్ టైమ్ రికార్డు ధరలు పలికాయి. హిందీ నుంచి 175 కోట్లు వచ్చాయి. మొత్తానికి విడుదలకు ముందే.. ఈ సినిమా 833 కోట్ల బిజినెస్ చేయగలిగింది. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇది. అంటే.. మిగిలినదంతా లాభమే అన్నమాట.