ఒక్క సినిమాతోనే కీర్తి సురేష్ స్టార్‌డమ్ దక్కించుకుంది. 'మహానటి' సినిమాతో కీర్తిసురేష్ తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించుకుంది. అయితే సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్‌కి ఇప్పుడు ఓ కొత్త భయం వెంటాడుతోందట.
రెండో సావిత్రి కీర్తి సురేష్ అన్న ట్యాగ్‌లైన్ బాగానే ఉంది కానీ, ఇంతటి బరువైన పాత్ర, అంతటి మహానటి పాత్రను పోషించాక కీర్తి సురేష్ ఫ్యూచర్ ఎలా ఉండనుందా? అనే ఆలోచనలు, అనమానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే, ఇకపై కీర్తిని గ్లామరస్ పాత్రల్లో చూడలేము. అఫ్‌కోర్స్ ఇంతవరకూ కీర్తిని అలా చూసింది లేదు కానీ, అయినా అసలు సిసలు స్టార్‌డమ్ అంటే హీరోయిన్స్‌కి, కమర్షియల్ పాత్రలు చేసినప్పుడే దక్కుతుంది. ఆ కోణంలో కీర్తి నెక్ట్స్ కమర్షియల్ పాత్రలను ఒప్పుకుంటుందా? లేదా? అని ఆమె అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
అయితే స్వీటీ బ్యూటీ అనుష్క 'అరుంధతి' సినిమా తర్వాత పలు కమర్షియల్ చిత్రాల్లో కూడా నటించింది. అయితే అనుష్క వేరు, కీర్తి వేరు. అనుష్కలా మేనేజ్ చేయడం కీర్తికి సాధ్యమయ్యే పని కాదని మాత్రం చెప్పగలం. అనుష్కలా కాకపోయినా, కొంచెమైనా గ్లామరస్ లుక్‌లో కనిపించాలి కదా. చూడాలి మరి కీర్తి ఏం చేస్తుందో.
ప్రస్తుతం కీర్తి సురేష్ తమిళంలో విక్రమ్ సరసన 'సామి 2' చిత్రంలో నటిస్తోంది. తెలుగులో 'మహానటి' తర్వాత కీర్తి మరో కొత్త ప్రాజెక్ట్‌కి సైన్ చేసింది లేదు.