మాస్ రాజా రవితేజ త్వరలోనే 'నేల టికెట్టు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాతో ముద్దుగుమ్మ మాళవికా శర్మ హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మాళవికను ఎలా ఎంచుకున్నారో తెలుసా?
ఫోటో చూసి ఓకే చేసేశాడట రవితేజ. ఆమెపై ఓ సారి టెస్ట్ షూట్ చేద్దామన్నాడట డైరెక్టర్ కళ్యాణ్‌కృష్ణ. అయితే అవసరం లేదు. ఈమె ఫిక్స్ అన్నాడట రవితేజ. ఫస్ట్ ఫోటో చూడగానే ఆమె కళ్లు నచ్చేశాయట. ఆ తర్వాత ఆమె స్మైల్ నచ్చిందట. అలా ఆమెని రవితేజ టెస్ట్ షూట్ కూడా లేకుండా ఓకే చేసేశాడట. ఇప్పుడు ఆమె అందరికీ నచ్చేస్తోందిలెండి. ఇంకా సినిమా విడుదల కాకుండానే సమ్‌థింగ్ స్పెషల్ అనేలా ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేస్తోందీ బ్యూటీ.
అంతేకాదు ఆల్రెడీ తన హాట్‌నెస్‌తో కుర్రోళ్ల గుండెల్లో కాక పుట్టించేస్తోంది. అగ్గి రాజేసేస్తోంది. ఇక సినిమా విడుదలై, సక్సెస్ టాక్ వచ్చిందా అంతే సంగతి. అమ్మడి స్టార్ ఎక్కడికో వెళ్లిపోతుంది. అసలే టాలీవుడ్‌కి హీరోయిన్స్ కొరతాయె. ఈ తరుణంలో మాళవికా శర్మ తన యాక్టింగ్ టాలెంట్‌తో ఆకట్టుకుందంటే, ఇక చిన్న చిన్న పొరపాట్లున్నా. అవన్నీ ఆమె గ్లామరస్ లుక్‌తో కొట్టుకుపోతాయి.
చూడాలిక హాట్ బ్యూటీ మాళవిక శర్మ తన టాలెంట్‌తో ఆడియన్స్‌ని మెప్పించడంలో ఎన్ని మార్కులేయించుకుంటుందో. ఈ నెల 25న 'నేల టికెట్టు' ప్రేక్షకుల ముందుకు రానుంది.