కీర్తిసురేష్‌ 'వి' సక్సెస్‌ మంత్ర.!

మరిన్ని వార్తలు

ఇటీవల 'మహానటి' సినిమాతో ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ కూడా మంచి నటిగా గుర్తింపు దక్కించుకున్న బ్యూటీ కీర్తి సురేష్‌. మొదట్లో ఈ పాత్రకు కీర్తి సురేష్‌ ఏంటీ? యాక్టింగ్‌లో అస్సలు అనుభవమే లేని కీర్తిని అనవసరంగా ఈ సినిమా కోసం ఎంచుకుని తప్పు చేశారంటూ చిత్ర యూనిట్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు పలువురు సినీ ప్రముఖులు. 

కానీ ఆ విమర్శలన్నింటికీ గొడ్డలి పెట్టుగా సినిమా విడుదలయ్యాక తన తడాఖా ఏంటో చూపించింది కీర్తి సురేష్‌. సావిత్రి మళ్లీ పుట్టింది అనే ట్యాగ్‌లైన్‌ వేయించుకుంది. ప్రతీ సినీ ప్రముఖునితోనూ కీర్తించుకుంది. తన పేరులోని కీర్తి 'మహానటి' సినిమాతో పూర్తిగా దక్కించేసుకుంది ఈ ఒక్క సినిమాతోనే కీర్తి సురేష్‌. 

ఇకపోతే ఈ సినిమాతో వచ్చిన పేరు ప్రఖ్యాతలకు తెలుగులో సంగతి అటుంచితే తమిళ చిత్ర సీమ మాత్రం ఆమెను ఆకాశానికెత్తేస్తోంది. వరుసగా అగ్ర హీరోల సరసన నటిస్తోంది కీర్తి సురేష్‌. విక్రమ్‌తో 'సామి 2' చిత్రంలోనూ, విశాల్‌తో 'సండకోళి 2' చిత్రంలోనూ, విజయ్‌తో 'సర్కార్‌'లోనూ నటిస్తోంది. 

ఇక్కడ గమనించాల్సిందేమంటే, ఈ ముగ్గురు పేర్లు 'వి' లెటర్‌తోనే స్టార్ట్‌ అవడం విశేషం. ఈ ముగ్గురిలోనూ ఎవరితో కీర్తి సురేష్‌ విజయం అందుకుంటుందో ఏమో కానీ, ఈ మూడు సినిమాలపైనా భారీగా అంచనాలున్నాయి. 

చూడాలి మరి, కీర్తి సురేష్‌ ట్రిపుల్‌ 'వి' సక్సెస్‌ మంత్రం ఎవరితో వేయనుందో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS