రాజుగాడు విడుదల తేదీ ఎప్పుడో తెలుసా?

మరిన్ని వార్తలు

యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న "రాజుగాడు" చిత్రం జూన్ 1 న విడుదల కానుంది. 'ఈడో రకం ఆడో రకం', 'అందగాడు ', 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' వంటి విజయవంతమైన చిత్రాలనందించిన సక్సెస్ఫుల్ బ్యానర్ నుండి వస్తుండటంతో చిత్రం భారీ ఆసక్తి నెలకొని ఉంది. 

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంతో  సంజనారెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. రాజ్ తరుణ్ సరసన అమైరా దస్తూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో డా. రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ కు విశేష స్పందన వచ్చింది. 

ఇటీవలే విడుదలైన మొదటి పాట సంగీత ప్రియులను అలరిస్తుంది. సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్ గా నిలవనుంది. ఆడియో లాంచ్ మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్ మే మూడవ వారంలో జరపనున్నారు.

- ప్రెస్ రిలీజ్

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS