సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం భరత్ అనే నేను లో ఒక షాట్ లో మీసంతో కనిపించి తన అభిమానులకి ఒక కొత్తరకమైన అనుభూతిని కలిగించాడు. అయితే ఇప్పుడు ఆ అనుభూతి స్థాయిని ఇంకొంచెం పెంచానున్నాడట మహేష్.
ఆ వివరాల్లోకి వెళితే, మహేష్ బాబు-వంశీ పైడిపల్లి చిత్రంలో ఒక ఎపిసోడ్ మొత్తం మీసం.. గడ్డంతో కనిపించబోతున్నాడట. కథలో ఈ ఎపిసోడే అత్యంత కీలకం అని తెలుస్తుంది, అందుకే మహేష్ కూడా ఇంతకు ముందెన్నడూ కనిపించిన విధంగా కనిపించడానికి ఇష్టం చూపిస్తున్నాడట.
ఇదిలావుండగా ఫ్యాన్స్ మాత్రం మహేష్ ఇలా మీసం.. గడ్డం తో ఎలా ఉండబోతున్నాడు అంటూ ఇప్పటినుండే కొన్ని స్కెచ్ లు వేసేసుకుంటున్నారు. అయితే త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలుకానుంది, వచ్చే ఏడాదిలో ఈ చిత్రం విడుదల అవుతుంది అని అర్ధమవుతుంది.
మొత్తానికి క్లాస్ సూపర్ స్టార్ తొలిసారిగా రఫ్ గా మాస్ గా మీసం... గడ్డంతో సందడి చేయబోతున్నాడు.