సినీ రంగానిదీ, రాజకీయ రంగానిదీ విడదీయరాని అనుబంధం. సినిమాల్లో ఓ రేంజ్ స్టార్‌డమ్ దక్కించుకున్నాక, ఆ స్టార్‌డమ్‌ని రాజకీయాల్లో ఉపయోగించాలనుకుంటారు నటీనటులు. అలాగే వారి స్టార్‌డమ్‌నీ, గ్లామర్‌నీ తమ పార్టీలకు ఉపయోగించుకోవాలనుకుంటారు ఆయా రాజకీయ వర్గాలు. ఇది ఎప్పటి నుండో వస్తున్న సాంప్రదాయమే. అయితే, తాజాగా కీర్తిసురేష్‌పై రాజకీయ వార్తలు రావడం ఒకింత ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో నిలదొక్కుకుంటోంది కీర్తిసురేష్.
తొలి నాళ్లలోనే 'మహానటి' వంటి అరుదైన అవకాశం దక్కడంతో కీర్తిసురేష్‌కి కొంచెం తొందరగానే స్టార్‌డమ్ దక్కేసింది. అయితే, ఆ స్టార్‌డమ్‌ని కొనసాగించేందుకు కీర్తిసురేష్ మరింత కష్టపడాల్సి ఉంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సత్తా చాటుతోంది. లేటెస్ట్‌గా హిందీలోనూ అడుగుపెట్టింది. అజయ్‌దేవగణ్‌తో బోనీ కపూర్ నిర్మిస్తున్న సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ అవకాశం అక్కడ ఆమె కెరీర్‌కి ఎంతగా ఉపయోగపడుతుందో తెలీదు కానీ, కీర్తిసురేష్ రాజకీయ ప్రవేశం అంటూ తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
త్వరలో కీర్తిసురేష్ బీజేపీ పార్టీలో చేరనుందనే గాలి వార్తలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టేస్తోంది. అయితే, ఈ విషయమై కీర్తి సురేష్ స్పందించలేదు కానీ, ఆమె తల్లి, సీనియర్ నటి అయిన మేఘనా రెస్పాండ్ అయ్యింది. కీర్తిసురేష్ తండ్రికి రాజకీయాలతో సంబంధం ఉంది. బీజేపీ తరపున ఆయన రాజకీయాల్లో ప్రజలకు సేవ చేస్తున్నారు. సో ఆ రకంగా కీర్తిపై ఈ వార్తలు పుట్టడం సహజమే. కానీ తనకు కానీ, కీర్తికి కానీ రాజకీయాల్లో ఎలాంటి ఆశక్తి లేదనీ ఆమె తేల్చేశారు. ప్రస్తుతం కీర్తి ఫోకస్ అంతా సినిమాల పైనే అని మేనకా స్పష్టం చేశారు.