కాస్త బొద్దుగా వుండడంతో అవకాశాలు తక్కువగా వస్తున్నాయని అనుకుందేమో, బాగా బక్కచిక్కిపోయింది ‘మహానటి’ కీర్తి సురేష్. అయితే, అలా బక్క చిక్కిపోవడంతో మునుపటి ‘గ్లో’ ఆమెలో కనిపించడంలేదు. నటిగా ఆమె మంచి మార్కులేయించుకుంటున్నా, లుక్ పరంగా చాలా విమర్శల్ని ఎదుర్కొంటోంది. తాజాగా ‘మిస్ ఇండియా’ ట్రైలర్ బయటకు వచ్చింది. ఇక్కడా ఆమె బక్కచిక్కిపోవడంపైనే నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. కీర్తి సురేష్ గనుక బొద్దుగా కన్పించి వుంటే, ఆ ఇంపాక్ట్ ఇంకోలా వుండేదన్నది చాలామంది అభిప్రాయం. ఈ తరహా అభిప్రాయాలు గతంలోనూ వచ్చాయి. దాంతో, కీర్తి సురేష్ మళ్ళీ మనసు మార్చుకోక తప్పేలా లేదనీ, కాస్త బరువు పెరగడం తప్ప ఆమె ముందు ఇంకో ఆప్షన్ లేదనీ అంటున్నారు.
ఇదిలా వుంటే, మెగాస్టార్ చిరంజీవితో కీర్తి సురేష్ ఓ సినిమా చేయనుందనే ప్రచారం జరుగుతోంది. మహేష్‌తోనూ ఓ సినిమా చేయబోతోంది కీర్తి సురేష్. ‘సర్కారు వారి పాట’ కోసం కీర్తిని మహేష్ సరసన హీరోయిన్‌గా ఎంపిక చేసిన విషయం విదితమే. దాంతో, కీర్తి సురేష్ ఇంకాస్త బొద్దుగా మారడం తప్పనిసరైపోయింది. కానీ, కీర్తి సురేష్ ఇంకాస్త బరువు పెరిగే ఆలోచన చేస్తుందా.? లేదంటే, ఈ స్లీక్ అండ్ స్లివ్‌ు లుక్ కూడా జనానికి త్వరగానే అలవాటైపోతుందనే గట్టి నమ్మకంతో ఇదే లుక్‌ని కొనసాగిస్తుందా.? అన్నది వేచి చూడాల్సిందే. ఏ మాటకామాటే చెప్పుకోవాలంటే కీర్తి సురేష్ బబ్లీ లుక్‌లోనే బావుంటుందన్నది మెజార్టీ అభిప్రాయం.