`ఆర్.ఆర్.ఆర్` నుంచి రెండు టీజర్స్ వచ్చేశాయి. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ల దర్శనం అయిపోయింది. చరణ్ టీజర్‌కి ఎన్టీఆర్, ఎన్టీఆర్ టీజర్‌కి చరణ్ గొంతులు అరువివ్వడం, రెండు పాత్రల ఎలివేషన్స్ ఓ రేంజ్ లో ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
అయితే.. ఈ రెండు టీజర్లలో కనిపించిన షాట్స్, ఆ డైలాగ్స్ ఏవీ.. సినిమాలో ఉండవని తెలుస్తోంది. ఇవి కేవలం టీజర్ కోసమే తీసిన షాట్స్. అందుకే సినిమాలో కనిపించే అవకాశమే లేదు. నిజానికి సినిమాలోని కొన్ని విజువల్స్ తీసుకుని టీజర్ కట్ చేస్తారు. కానీ.. రాజమౌళి మాత్రం కాస్త విభిన్నంగా ఆలోచించి, కేవలం టీజర్ల కోసమే షూట్ చేశారు. ఇటీవలే `ఆర్.ఆర్.ఆర్` షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. అప్పుడు తీసిన షాట్సే... `కొమరం భీమ్` టీజర్‌లో కనిపించాయి. ఈ టీజర్‌లో కనిపించిన విజువల్స్ పాతవే అని ప్రచారం జరుగుతోంది. రాజమౌళి పాత విజువల్స్ తీసుకోవడానికి కూడా కారణం అదే. అవి సినిమాలో ఉండవు కాబట్టి, ధైర్యంగా వాడేశాడేమో.