ఓటీటీలో విడుదలైన సినిమాలన్నీ దాదాపుగా ఫట్టుమంటున్నాయి. మరీ ముఖ్యంగా పెద్ద సినిమాలు నిరాశ జనకమైన ఫలితాల్ని రాబట్టుకుంటున్నాయి. వి, నిశ్శబ్దం, పెంగ్విన్ ఇవన్నీ ఫ్లాపులే. తాజాగా ఈ జాబితాలో `మిస్ ఇండియా` కూడా చేరిపోయింది. ఓటీటీలో మరో పరాజయం ఇది. అయితే... ఈ సినిమా వల్ల నిర్మాతలకు లాభమా? నష్టమా? అనే ఆసక్తికరమైన చర్చ మొదలైంది. నిజానికి ఈ సినిమాతో నిర్మాతలు బాగా లాభపడ్డారు.
ఈ సినిమాకి కేవలం 6 కోట్లతో ముగించారు నిర్మాత. నెట్ ఫ్లిక్స్ నుంచి దాదాపు 11 కోట్ల వరకూ వచ్చాయని టాక్. ఈ మొత్తం శాటిలైట్ తో సహా. హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో మరో 2 కోట్లు వస్తాయనుకుంటే, మొత్తంగా 13 కోట్లు. అంటే... దాదాపు 7 కోట్ల లాభమన్నమాట. నెట్ ఫ్లిక్స్ పరిస్థితి ఎలా ఉన్నా, నిర్మాతలకు మాత్రం మిస్ ఇండియా గిట్టు బాటు ప్రాజెక్టే.