ఈమధ్య కాలంలో ఓటీటీ హడావుడి బాగా పెరిగింది. కొత్త సినిమాన్నీ ఓటీటీలోనే నేరుగా రీలీజ్ అవుతున్నాయి. అందులో హిట్టూ, ఫట్టూ పక్కన పెడితే, సినీ ప్రేమికులకు కాస్త కాలక్షేపం దొరుకుతోంది. కీర్తి సురేష్ నటించిన `పెంగ్విన్` ఓటీటీలోనే విడుదలైంది. ఈ సినిమాకి రేటింగ్స్ పెద్దగా రాలేదు. కానీ వ్యూవర్ షిప్ మాత్రం బాగానే వచ్చింది. దాంతో నిర్మాతలూ, ఓటీటీ యాజమాన్యం హ్యాపీగానే ఉన్నారు.
అందుకే ఇప్పుడు మరోసారి కీర్తి సినిమా ఓటీటీ తెరపై ఆడబోతోందని టాక్. కీర్తి సురేష్ నటించిన `మిస్ ఇండియా` షూటింగ్ పూర్తయి, విడుదలకు రెడీగా ఉంది. దీన్ని కూడా ఓటీటీలోనే విడుదల చేయాలని నిర్మాత మహేష్ కోనేరు భావిస్తున్నట్టు టాక్. ఇప్పటికే ఓటీటీలతో సంప్రదింపులు పూర్తయ్యాయట. త్వరలోనే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి, ప్రమోషన్లు మొదలెడతారని టాక్. దీంతో పాటు `గుడ్ లక్ సఖీ` అనే మరో సినిమా కూడా రెడీగానే ఉంది. వీలైతే దాన్ని కూడా ఓటీటీలోనే విడుదల చేయాలన్నది నిర్మాతల ఆలోచన. చూస్తుంటే.. కీర్తి ఓటీటీ స్టార్ అయిపోయేట్టు వుంది.