'మహానటి' కోసం క్యూ కడుతున్న 'ఆ' సినిమాలు.

మరిన్ని వార్తలు

'మహానటి'తో కీర్తిసురేష్‌ నిజంగానే ఈ తరం మహానటి అనిపించుకుంది. అలనాటి మేటి నటి మహానటి సావిత్రిని మైమరపించింది తన పర్‌ఫామెన్స్‌తో. అందుకే జాతి గర్వించింది. జాతీయ అవార్డులు ఈ సినిమాకి పోటెత్తాయి. ఇక జాతీయ అవార్డు దక్కించుకున్నాక కీర్తికి లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌ పోటెత్తుతున్నాయట. ఇప్పటికే తెలుగులో కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో ఓ లేడీ ఓరియెంటెడ్‌ మూవీ తెరకెక్కుతోంది.

 

తాజాగా తమిళంలో మరో లేడీ ఓరియెంటెడ్‌ స్టోరీ కీర్తి కోసం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాని ప్రముఖ తమిళ దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజ్‌ నిర్మిస్తుండడం విశేషం. ఈశ్వర్‌ కార్తిక్‌ ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. థ్రిల్లర్‌ జోనర్‌లో ఈ సినిమాని రూపొందిస్తున్నారనీ తెలుస్తోంది. ప్రస్తుతం కీర్తి సురేష్‌ చేతిలో చాలా ప్రాజెక్టులున్నాయి. తెలుగులో రెండు సినిమాలూ, తమిళంలో ఓ సినిమా, మలయాళంలో మోహనల్‌లాల్‌ సినిమాలోనూ కీర్తి సురేష్‌ నటిస్తోంది.

 

ఇవన్నీ కాక, ఇటీవలే బాలీవుడ్‌లోనూ కీర్తి పతాకం ఎగరవేసేందుకు సిద్ధపడుతోంది. అజయ్‌ దేవగణ్‌తో కీర్తిసురేష్‌ ఓ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా కార్తీక్‌ సుబ్బరాజ్‌ సినిమా తెర పైకి వచ్చింది. ఇంతవరకూ పక్కింటమ్మాయిలా కనిపించిన కీర్తి సురేష్‌, ఈ సినిమాలో డిఫరెంట్‌ బాడీ లాంగ్వేజ్‌తో కనిపించబోతోందట. అదేంటో ప్రస్తుతానికి సస్పెన్స్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS