హౌస్‌లో ఉన్నప్పుడు తమన్నా రవికృష్ణ విషయంలో బిహేవ్ చేసిన తీరు మాదిరిగానే ఇప్పుడు శ్రీముఖి, రాహుల్ విషయంలో ప్రవర్తిస్తోంది. రాహుల్ చాలా జెంటిల్‌గా వ్యవహరిస్తున్నాడు. కానీ, అది తట్టుకోలేకపోతోంది శ్రీముఖి. హౌస్‌లోకి రాకముందు శ్రీముఖి, రాహుల్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండేదట. అయితే, అది హౌస్‌లోకి వచ్చాక, బద్ధ శత్రుత్వంగా మారిపోయింది. టాస్క్‌ల్లో అమ్మాయిలు, అబ్బాయిలు పట్టుకోవడం, ముట్టుకోవడం కామన్. కానీ, రాహుల్‌కి శ్రీముఖి షరతులు పెడుతోంది.
ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తే కుదరదు. అసలు డోంట్ టచ్ మీ రాహుల్.. అంటూ విచిత్రంగా ప్రవర్తిస్తోంది. ఈ తీరు హౌస్‌మేట్స్‌కే కాదు, వీక్షకుల్ని కూడా విసిగిస్తోంది. తాజాగా జరిగిన 'డ్రాగన్ ఎగ్' టాస్క్‌లో భాగంగా, డ్రాగన్ ఎగ్‌ని దక్కించుకోవడంలో కొంత తోపులాట, గింజులాటలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో శ్రీముఖి మిగిలిన మేల్ కంటెస్ట్ంట్స్తో బాగానే వ్యవహరించింది.
కానీ, రాహుల్ ఒక్కడికే అర్ధం పర్ధం లేని రూల్స్ పాస్ చేసింది. దాంతో రాహుల్ చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ, ఎక్కడా హద్దులు దాటలేదు. అసహనం కోల్పోలేదు. అలా శ్రీముఖి, రాహుల్‌పై విషం చిమ్మే ప్రయత్నం చేసింది. అంతే కాదు, ఈ టాస్క్‌లో కన్నింగ్‌గా సూచనలు, స్కెచ్‌లు వేసి, తనలోని కన్నింగ్ మెంటాలిటీని మరోసారి బయట పెట్టుకుంది శ్రీముఖి.