'సాహో' లో ముఖ్యమైన సీన్ అదే: ప్రభాస్..!

మరిన్ని వార్తలు

'సాహో'.. ఇప్పుడు అందరి నోటా నానుతున్న పేరు. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన తాజా చిత్రం ఇది. యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వం లో యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న భారీ యాక్షన్ చిత్రం సాహో. 'బాహుబలి' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సుమారు రెండున్నర ఏళ్ళు ఈ సినిమా కోసం శ్రమించారు సాహో చిత్ర బృందం. ఇటీవల విడుదలైన 'సాహో ట్రైలర్' చూసాక అర్ధమవుతుంది ఈ సినిమా కోసం వాళ్ళు పడ్డ శ్రమ. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా హీరో ప్రభాస్ మరియు గ్లామర్ డాల్ శ్రద్ధా కపూర్ ప్రమోషన్స్ కూడా మొదలెట్టేసారు.

 

ఈ నెల 10న ముంబై లో ట్రైలర్ లాంచ్ చేసిన తర్వాత తాజాగా హైదరాబాద్ లో తెలుగు మీడియా మిత్రులకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు మన ప్రభాస్. అందులో భాగంగా యువ దర్శకుడు సుజీత్ పై నమ్మకం ఎలా వచ్చింది అని ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు ప్రభాస్ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు.. "సినిమాలో 'లాల్ బంగ్లా సీన్' ఒకటి ఉంటుంది, అది ఈ చిత్రం లో 5..6 సార్లు వస్తుంది.. 5 ధృక్కోణాల్లో ఈ సీన్ ని తెరకెక్కించారు. షూటింగ్ లో మొదట చిత్రీకరించిన సీన్ కూడా ఇదే.." దాన్ని సుజీత్ తెరకెక్కించిన తీరు చూసాక అతని పై కాన్ఫిడెన్స్ వచ్చేసింది.. అంటూ సమాధానం ఇచ్చాడు మన డార్లింగ్. ఇలా ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ఉంటుందట సాహో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS