కీర్తి సురేష్‌, ఇమేజ్‌ పూర్తిగా మార్చేయనున్న ‘సర్కారు’

మరిన్ని వార్తలు

కీర్తి సురేష్‌ అనగానే మన పక్కింట్లో అమ్మాయి.. కాదు కాదు, మనింట్లో అమ్మాయే అన్నట్లు తెరపై కన్పిస్తుంటుంది. కానీ, ట్రెండ్‌కి తగ్గట్టుగా తనను తాను మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందామెకి. ‘మహానటి’ లాంటి పెద్ద హిట్‌ కొట్టినా, సూపర్‌ స్టార్‌ అనిపించుకోవాలంటే, అంతకు మించిన కమర్షియల్‌ సక్సెస్‌లు అందుకోవాల్సిందే. సూపర్‌ స్టార్‌ మహేష్‌ సరసన చేస్తోన్న ‘సర్కారు వారి పాట’ తనకు ఆ స్థాయి విజయాన్ని ఇస్తుందనే నమ్మకంతో వుంది కీర్తి సురేష్‌.

 

‘సూపర్‌ టాలెంటెడ్‌..’ అంటూ కీర్తి సురేష్‌ని అభినందిస్తూ, పుట్టినరోజు శుభాకాంక్షలు ఆమెకు అందించాడు మహేష్‌బాబు. మరోపక్క, కీర్తి సురేష్‌ ఈ సినిమా కోసం బీభత్సమైన గ్లామరస్‌ టచ్‌ ఇవ్వబోతోందట. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కోసం రష్మిక మండన్న ఇచ్చిన గ్లామర్‌ టచ్‌ కంటే ఇంకాస్త ఎక్కువే వుండబోతోందట కీర్తి ఇవ్వబోయే టచ్‌. పరశురావ్‌ు సినిమాల్లో హీరోయిన్లు అందంగా కన్పిస్తారు.

 

పెద్దగా వల్గారిటీ వుండదుగానీ, ఓ మోస్తరు గ్లామర్‌ కనిపిస్తుంటుంది. ఆ తరహా గ్లామర్‌కి పెద్దగా అభ్యంతరాలు ఏ సినిమాలోనూ పెట్టని కీర్తి సురేష్‌, ఇంకొంచెం డోస్‌ ‘సర్కారు వారి పాట’ కోసం పెంచబోతోందని సమాచారం. ‘గ్లామరస్‌ ఇమేజ్‌ అంటే, ఎక్స్‌పోజింగ్‌ మాత్రమే కాదు..’ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన కీర్తి సురేష్‌, కొంచెం ‘పెప్‌’ తన గ్లామర్‌కి యాడ్‌ చేయడం నిజమే అయితే.. కమర్షియల్‌ హీరోయిన్‌గా ఆమె రేంజ్‌ ఇంకో రేంజ్‌లో వుంటుందని నిస్సందేహంగా చెప్పొచ్చు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS