కీర్తిసురేష్‌ కొత్త సినిమా లుక్‌ చూశారా?

మరిన్ని వార్తలు

'మహానటి' సినిమాతో ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కి వెళ్లిపోయింది ముద్దుగుమ్మ కీర్తిసురేష్‌. తెలియకుండానే చాలా ప్రాజెక్టులు లైన్‌లో పెట్టేసింది. ఈ రోజు కీర్తిసురేష్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆమె నటిస్తున్న చిత్రాల తాలూకు చిట్టా బయటకొచ్చింది. తెలుగులో కీర్తి సురేష్‌ నితిన్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'రంగ్‌దే' చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇవి కాక కీర్తి సురేష్‌ 'మిస్‌ ఇండియా' అనే హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మరి ఈ సంగతులు తెలుసా.? ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాకి టైటిల్‌ 'పెంగ్విన్‌' అంటూ ఆ సినిమాలో కీర్తి సురేష్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు. కీర్తిసురేష్‌ ప్రెగ్నెంట్‌గా ఉన్న షాడో లుక్‌ ఇది. ఈ సినిమాతో పాటు, మరో సినిమా లుక్‌నీ ఈ సందర్భంగా రిలీజ్‌ చేశారు. 'వర్త్‌ ఏ షాట్‌ మోషన్‌ ఆర్ట్స్‌' ప్రొడక్షన్‌ నెంబర్‌ వన్‌ అంటూ దిల్‌ రాజు సమర్పణలో రూపొందుతోన్న ఈ సినిమా నుండి రిలీజ్‌ చేసిన కీర్తి సురేష్‌ లుక్‌ చాలా ఆసక్తికరంగా ఉంది. ఓ పాత కాలపు అమ్మాయిలా కనిపిస్తోంది కీర్తి ఇక్కడ. చేతులకు కడియాలు, పాత కాలం నాటి లంగా జాకెట్టు ధరించి అమాయకంగా నట్టింట్లో నవ్వుతూ కనిపించింది. అన్నట్లు ఈ లుక్‌లో కీర్తి చాలా స్లిమ్‌గా కనిపిస్తోంది. కీర్తి సురేష్‌ అంటే కాస్త బొద్దుగా ముద్దుగా కనిపించే రూపమే అందరికీ తెలుసు. అలాంటిది ఈ లుక్‌లో కీర్తిని చూసి అభిమానులు షాక్‌ అవుతున్నారు. ఈ సినిమా కథా కమామిషు ఏంటనేది తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే. దీపావళికి ఈ సినిమా టైటిల్‌ అనౌన్స్‌ చేయనున్నారట. ఆది పినిశెట్టి, జగపతిబాబు, రాహుల్‌ రామకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS