'మహానటి' కీర్తి సురేష్‌కి టైమ్ అస్సలేమాత్రం కలసిరావడం లేదు. ఈ మధ్య వరుస ఫ్లాపులు ఆమె కెరీర్‌ని వెక్కిరించేస్తున్నాయి. 'మహానటి' సినిమాతో తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో వచ్చిన గుర్తింపు కారణంగా వరుస అవకాశాల్ని దక్కించుకున్న కీర్తి, ఆ స్థాయిలో ఇప్పుడు సక్సెస్‌లు మాత్రం అందుకోవడంలేదు. ఫ్లాపుల మీద ఫ్లాపులు ఆమెను 'వద్దంటున్నా' పలకరించేస్తున్నాయి.
తాజాగా ఆమె ఖాతాలో మరో 'ఫ్లాప్' పడిందంటున్నారు ట్రేడ్ పండితులు. విజయ్ హీరోగా నటించిన 'సర్కార్' ప్రేక్షకుల ముందుకొచ్చింది.. సినిమాలో సత్తా లేదని తేలిపోయింది. విజయ్ అభిమానులు, తమ అభిమాన హీరోని తెరపై చూసి మురిసిపోవడం సంగతి పక్కన పెడితే, 'కీర్తి సురేష్ ఇలాంటి సినిమాలు ఎందుకు ఒప్పుకుంటోంది.?' అంటూ అందరూ కీర్తి సురేష్‌నే టార్గెట్ చేస్తున్నారు.
'సామి స్క్వేర్' సినిమా రిజల్ట్ కీర్తి సురేష్‌కి పెద్ద షాక్. ఆ తర్వాత వచ్చిన 'పందెం కోడి' సీక్వెల్ కూడా అంతే. కాస్తో కూస్తో 'పందెం కోడి-2' బెటర్ వసూళ్ళ పరంగా. అయినాగానీ, ఈ సినిమాలోనూ కీర్తి సురేష్ 'ఓవరాక్షన్'పై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా 'సర్కార్' రిజల్ట్ కీర్తి సురేష్‌కి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది.
వచ్చిన అవకాశాల్లో తన కెరీర్‌కి ఉపయోగపడే సినిమాలు చేయాల్సింది పోయి.. రెమ్యునరేషన్ కోసం వచ్చిన అవకాశాల్ని వచ్చినట్లే ఒప్పేసుకుంటూ, కీర్తి సురేష్ తన ఇమేజ్‌ని పాడు చేసుకుంటోందన్న విమర్శలకు ఆమె ఏం సమాధానమిస్తుందో!