మహానటి సావిత్రి బయోపిక్ తర్వాత కీర్తి సురేష్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. మహనటి తర్వాత కీర్తికి విజయాలు దక్కలేదు కానీ ఆమెను వెతుక్కుంటూ చాలా పాత్రలు, సినిమాలు వచ్చాయి. కీర్తి కూడా వరస పెట్టి సినిమాలు చేస్తుంది. అయితే కీర్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమాలకు ఓటీటీలో మంచి బిజినెస్ జరుగుతుంది. ఇప్పటికే పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు నేరుగా ఒటీటీలో విడుదలయ్యాయి. సినిమా రిజల్ట్ తో పనిలేకుండా నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వెళ్లారు. ఇప్పుడు కీర్తి నటించిన మరో సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చే అవకాశం వుంది.
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'సాని కాయిదం'. దర్శకుడు సెల్వ రాఘవన్ మరో కీలక పాత్రధారి. ఎనభైవ దశకంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కిన సినిమాని మొదట థియేటర్ లో విడుదల చేస్తామని భావించారు. అయితే అమోజాన్ ప్రైమ్ నుంచి చిత్ర నిర్మాతలకు మంచి ఆఫర్ వచ్చింది. దీంతో సినిమాని నేరుగా ఒటీటీకి ఇచ్చేయలానే ఆలోచనలో వున్నారు. అయితే కీర్తి సురేష్ కి వున్న ఇమేజ్ కారణంగా తమిళ్ వెర్షన్ తో పాటు తెలుగు హిందీ మలయాళం డబ్బింగ్ కూడా చెప్పించాలనే ఆలోచనలో వుంది అమోజాన్. త్వరలోనే స్త్రిమింగ్ డేట్ ని ప్రకటిస్తారు.