ఈ సారైనా కీర్తి దక్కుతుందా.?

By iQlikMovies - October 30, 2018 - 13:47 PM IST

మరిన్ని వార్తలు

తెలుగులో 'మహానటి' చిత్రంతో కీర్తి పతాకం ఎగరేసిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌ ఆ తర్వాత తెలుగులో ఒక్క సినిమాకీ సైన్‌ చేయలేదు. అందుకు కారణం తమిళంలో అమ్మడు ఫుల్‌ బిజీగా ఉండడమే. 'మహానటి' తర్వాత తమిళంలో కీర్తి సురేష్‌ నుండి 'సామి స్క్వేర్‌', 'పందెం కోడి 2' వంటి సినిమాలొచ్చాయి. వాటిలో విక్రమ్‌తో నటించిన 'సామి స్క్వేర్‌' ఆశించిన రిజల్ట్‌ని అందించలేదు. కానీ విశాల్‌తో నటించిన 'పందెం కోడి 2' టాక్‌కి భిన్నంగా వసూళ్లు రాబడుతోంది. 

అయితే ఈ రెండు సినిమాల్లోనూ కీర్తి సురేష్‌ పాత్రకు పెద్దగా పేరు దక్కలేదు. రెండూ విభిన్న పాత్రలే అయినా కానీ, ఆశించిన కీర్తి దక్కించుకోలేకపోయింది కీర్తి సురేష్‌. ఇకపోతే ఇప్పుడు తమిళంలో మరో అగ్రహీరో అయిన విజయ్‌ సరసన కీర్తి నటించిన 'సర్కార్‌' మూవీ రిలీజ్‌కి రెడీగా ఉంది. దీపావళి కానుకగా ఈ సినిమాను నవరబర్‌ 6న విడుదల చేస్తున్నారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రమోషన్స్‌లో ప్రస్తుతం కీర్తి సురేష్‌ బిజీగా ఉంది. డబ్బింగ్‌ చిత్రాలు కీర్తికి పెద్దగా కలిసి రావడం లేదు. 'సర్కార్‌'తోనైనా కీర్తి మంచి పేరు దక్కించుకుంటుందేమో చూడాలిక. 

ఇకపోతే 'కత్తి', 'తుపాకి' చిత్రాలతో బెస్ట్‌ హిట్‌ కాంబినేషన్‌గా పేరొందిన విజయ్‌ - మురగదాస్‌ కాంబోలో ముచ్చటగా మూడోసారి రూపొందిన చిత్రమే 'సర్కార్‌'. ఈ సినిమాతో ఈ కాంబో హ్యాట్రిక్‌కి రెడీ అయ్యారు. ఇదిలా ఉంటే, విజయ్‌ మరో హ్యాట్రిక్‌పైనా కన్నేశాడు. 'తెరీ', 'మెర్సల్‌' సినిమాలతో బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ ఇచ్చిన యంగ్‌ డైరెక్టర్‌ అట్లీతో తాజాగా మరో సినిమాకి కమిట్‌ అయ్యాడు విజయ్‌. 

'సర్కార్‌' విడుదలైన రెండు మూడు వారాల్లో ఈ సినిమా సెట్స్‌ మీదికెళ్లనుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS