సూర్య తండ్రి బాల‌య్య‌ని గుర్తుకు తెచ్చాడుగా..?!

By iQlikMovies - October 30, 2018 - 13:09 PM IST

మరిన్ని వార్తలు

`బాల‌య్య‌తో సెల్ఫీ` అన‌గానే అభిమానుల‌కు కంగారొచ్చేస్తుంది.  ఎప్పుడు ప్రేమ‌గా ఫోజు ఇస్తాడో, ఎప్పుడు సెల్ తీసుకుని నేల‌నేసి కొడ‌తాడో తెలీక బాల‌య్య ఫ్యాన్స్ క‌న్ ఫ్యూజ్ అవుతుంటారు. బాల‌య్య చేతిలో దెబ్బ‌లు తిన్న అభిమానులు ఎంతోమంది. `బాల‌య్య‌తో కొట్టించుకోవ‌డం కూడా ఓ స‌ర‌దా` అని అభిమానులు కూడా అంటుంటారు.

సూర్య తండ్రి శివ కుమార్ ఇప్పుడు బాల‌య్య‌ని గుర్తుకు తెచ్చాడు. ఓ అభిమాని తో దురుసుగా ప్ర‌వ‌ర్తించి త‌మిళ సీమ‌ని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.  న‌టుడిగా ఓవెలుగు వెలిగిన శివ‌కుమార్‌.. ఇప్పుడు సూర్య తండ్రిగానే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నాడు. సూర్య‌, కార్తి ఇద్ద‌రూ త‌మ అభిమానుల‌తో ఫ్రెండ్లీగానే ఉంటారు. ఓపిగ్గా సెల్ఫీలు దిగుతారు. కానీ శివ‌కుమార్ మాత్రం ఓ అభిమాని ద‌గ్గ‌ర దురుసుగా ప్ర‌వ‌ర్తించి షాక్ ఇచ్చాడు. 

ఇటీవ‌ల ఓ ప్రైవేటు కార్య‌క్ర‌మానికి హాజ‌రైన శివ కుమార్‌.. అక్క‌డ త‌న‌తో సెల్ఫీ దిగుదామ‌ని ప్ర‌య‌త్నించిన ఓ అభిమాని చేతిలోంచి ఫోన్ లాక్కుని నేల‌నేసి కొట్టాడు. సోష‌ల్ మీడియాలో ఈ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. శివ‌కుమార్ ఇలా చేసి ఉండాల్సింది కాద‌ని, త‌మిళ నాట సూర్య అభిమానులే వాపోతున్నారు. సూర్య ఎంత స్టార్ అయినా, అభిమానుల ముందు ఒదిగే ఉంటాడు. మ‌రి శివ‌కుమార్ ఇలా చేశాడేంటో..??  

తాజా ప‌రిణామాలు చూస్తుంటే సెల్ఫీ అంటే సెల‌బ్రెటీలే కాదు, అభిమానులూ భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితులు వ‌స్తున్నాయి. కాబ‌ట్టి ఇలాంటి సాహ‌సాల‌కు దూరంగా ఉండ‌డ‌మే మంచిది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS