చైతూతో నిధి జోష్‌ అదిరింది.!

మరిన్ని వార్తలు

చైతూ, నిధి అగర్వాల్‌ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'సవ్యసాచి'. ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేస్తున్న ఈ సినిమా సాంగ్‌ ప్రోమోస్‌లో ఇద్దరి కెమిస్ట్రీ చాలా చాలా బాగుంది. నిధి మంచి డాన్సర్‌. చైతూ డాన్సుల్ని ప్రత్యేకంగా అభినందించింది నిధి అగర్వాల్‌. 

లేటెస్టుగా '1980, 81, 82...' సాంగ్‌ ప్రోమో వచ్చింది. ఆ కాలంలో పాపులర్‌ అయిన కొన్ని ఇంట్రెస్టింగ్‌ థింగ్స్‌ని ఈ సాంగ్‌లో చూపించారు. సాంగ్‌ భలే ఎంజాయింగ్‌గా ఉంది. ఒనిడా టీవీ, నిర్మా సర్ఫ్‌, అప్పుడు పిల్లలు ఇష్టంగా తినే చాక్లెట్స్‌ పాపిన్స్‌, గోల్డ్‌ స్పాట్‌, క్యాసెట్‌ వంటి ఐటెమ్స్‌ చూపించారు. ఈ సాంగ్‌ చేసేపట్పుడు చాలా చాలా ఎంజాయ్‌ చేసిందట నిధి అగర్వాల్‌. ఆ కాలం నాటి గెటప్పులు, స్టైలింగ్‌, బాడీ లాంగ్వేజ్‌ చాలా కొత్తగా ఎట్రాక్ట్‌ చేస్తుున్నాయి. నాగచైతన్య, నిధి అగర్వాల్‌ జంట క్యూట్‌గా కరెక్ట్‌గా ఆ కాలం నాటి సెటప్‌కి సూటయిపోయింది.

 

ఇకపోతే నిధితో డాన్సుల్లో పోటీ పడడానికి చైతూ కూడా బాగా కష్టపడ్డాడట. సినిమాకి అన్నీ ప్లస్‌ పాయింట్స్‌గానే కనిపిస్తున్నాయి. స్టోరీ కాన్సెప్ట్, కథనం అంతా సరికొత్తగా అనిపిస్తోంది. ఆల్రెడీ చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్యకు 'ప్రేమమ్‌' వంటి సూపర్‌ హిట్‌ ఉంది. 'సవ్యసాచి'తో మరో సూపర్‌హిట్‌ని చైతూ తన ఖాతాలో వేసుకోవడం ఖాయమంటున్నారు అక్కినేని అభిమానులు. 

తమిళంలో రొమాంటిక్‌ హీరోగా పాపలర్‌ అయిన మాధవన్‌ ఈ సినిమాతో తొలిసారి తెలుగులో అడుగు పెడుతుండడం, అది కూడా పవర్‌ఫుల్‌ విలన్‌ పాత్ర కావడం అందరిలోనూ స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తోంది. చైతూకీ, మాధవన్‌కీ మధ్య వచ్చే సీన్లు ఆథ్యంతం ఉత్కంఠ కలిగించేలా ఉంటాయట. అవేంటో తెలియాలంటే నవంబర్‌ 2 వరకూ వెయిట్‌ చేయాల్సిందే. అదే రోజు 'సవ్యసాచి' ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS