టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ కథానాయికల్లో కీర్తి సురేష్ కూడా ఉంటుంది. తన కథల ఎంపిక, పాత్రల్ని ఎంచుకునే విధానం అందరికీ నచ్చింది. అందుకే `మహానటి` అనిపించుకుంది. ఆసినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని సైతం కైవసం చేసుకుంది. ఆ తరవాత ఆమె ఇమేజ్ మరింత పెరిగింది. అయితే.. కీర్తి ఓ అనూహ్యమైన నిర్ణయం తీసుకుందని, త్వరలోనే పెళ్లి చేసుకుని, సంసార జీవితాన్ని ప్రారంభించబోతోందని వార్తలు గుప్పుమన్నాయి.
ఓ బీజేపీ నాయకుడి కుమారుడిని కీర్తి పెళ్లి చేసుకోబోతోందని, పెళ్లయ్యాక సినిమాలకు దూరం అవుతుందన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలపై కీర్తి సీరియస్ అవుతోందట. అసలు ఇలాంటి వార్తలు ఎవరు పుట్టిస్తున్నారు అంటూ మండిపడుతోందట. తన దృష్టి ఇప్పుడు సినిమాలపైనే ఉందని, పెళ్లి గురించి ఆలోచించడం లేదని గట్టిగా చెబుతోందట. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటిపట్టునే ఉంటోంది కీర్తి. ఈమధ్య కొత్త కథలేవీ ఒప్పుకోలేదు. అందుకే ఈ వార్తలు బయటకు వచ్చాయేమో..?