బాలయ్య సరసన కీర్తిసురేష్‌.?

By iQlikMovies - July 02, 2018 - 16:23 PM IST

మరిన్ని వార్తలు

'నేను శైలజ' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌ వస్తూ వస్తూనే సూపర్‌ డూపర్‌ హిట్‌ తన ఖాతాలో వేసుకుంది. తర్వాత నటించిన చిత్రాలు కూడా విజయవంతమే అయ్యాయి కీర్తికి. 

ఇకపోతే ఇటీవల నటించిన 'మహానటి' సినిమా కీర్తిసురేష్‌ని నటిగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది. సినీ ప్రముఖుల నుండి, రాజకీయ ప్రముఖుల వరకూ కీర్తి నటనను మనస్పూర్తిగా ప్రశంసించకుండా ఉండలేకపోయారు. ఇప్పుడిదంతా ఎందుకంటే, మరోసారి కీర్తిసురేష్‌ సావిత్రి పాత్రలో కనిపించనుందనీ టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. ఎందుకంటారా? 

ప్రస్తుతం టాలీవుడ్‌లో నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆ మహానుభావుడి కుమారుడు బాలయ్య ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్ర పోషిస్తుండగా పలువురు ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. చారిత్రక చిత్రాలను సమర్ధవంతంగా తెరకెక్కించగల సామర్ధ్యం ఉన్న డైరెక్టర్‌ క్రిష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ క్రిష్‌ చేతికొచ్చాక సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఇదిలా ఉంటే, ఎన్టీఆర్‌ బయోపిక్‌ అంటే ఆ సినిమాలో అలనాటి నటీ నటుల పాత్రలకు ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఉంటుంది. ముఖ్యంగా ఎన్టీఆర్‌ - సావిత్రి పెయిర్‌కి ఉన్న ఇంపార్టెన్స్‌ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్‌ సినీ, రాజకీయ ప్రస్థానంలోని ముఖ్య ఘట్టాల సమాహారంగా రూపొందుతోందీ చిత్రం. సో సినీ జీవితానికి వచ్చేసరికి సావిత్రి పాత్ర కీలకం. ఈ కీలక పాత్ర కోసమే ఆల్రెడీ సావిత్రిగా మెప్పించిన కీర్తి సురేష్‌కి మరోసారి సావిత్రి మేకప్‌ వేయాలని అనుకుంటోందట చిత్ర యూనిట్‌. 

చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంతుందో. ఒకవేళ అదే జరిగితే స్టార్‌ హీరో బాలయ్య సరసన కీర్తి సురేష్‌కి చోటు దక్కేసినట్లేగా.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS