Keerthy Suresh: కేజీఎఫ్‌ సంస్థలో కీర్తీ సురేష్ కామెడీ డ్రామా

మరిన్ని వార్తలు

కేజీయఫ్‌’ పార్ట్‌ 1, 2 సినిమాలతో విశేష గుర్తింపు పొందిన సంస్థ హోంబలే ఫిల్మ్స్‌. ఇప్పుడీ నిర్మాణ సంస్థ ఓ లేడి ఓరియంటెడ్ చిత్రానికి శ్రీకారం చుట్టింది. దాని కోసం ప్రముఖ నటి కీర్తి సురేశ్‌ ను ఎంపిక చేసింది. ఈ చిత్రానికి ‘రఘు తాత’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమాకు సుమన్‌ కుమార్‌ దర్శకత్వం వహించనున్నారు. విజయ్‌ కిరంగదూర్‌ నిర్మాత.

 

హోంబలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న తొలి తమిళ సినిమా ఇదే. ఈ చిత్రాన్ని పాన్ తెలుగు కన్నడ మలయాళం భాషల్లో పాన్ ఇండియా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభంకానుంది.‘‘ఇదొక భిన్నమైన కామెడీ డ్రామా చిత్రం. దృఢ సంకల్పం కలిగిన ఓ మహిళ చేసే స్ఫూర్తిదాయక పోరాట గాథగా కనిపిస్తుంది’’ అని నిర్మాణ సంస్థ వెల్లడించింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS