టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. తాజాగా కీర్తి సురేష్‌కి పెళ్లి ఖాయమైందని, తన చిననాటి క్లాస్ మేట్ ని కీర్తి పెళ్లి చేసుకోబోతోందన్న ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కీర్తి చేతిలో `దసరా` సినిమా ఉంది. `భోళా శంకర్`లో చిరంజీవికి చెల్లాయిగా నటిస్తోంది. ఈమధ్య కీర్తి కొత్త సినిమాలేవీ ఒప్పుకోవడం లేదని, దానికి కారణం పెళ్లేనంటూ.. రూమర్లు షికారు చేస్తున్నాయి.
వీటిపై కీర్తి సురేష్ తల్లి... అప్పటి కథానాయిక మేనక స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని, కీర్తి పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టిందని స్పష్టం చేశారు. సో.. కీర్తి సురేష్ పెళ్లి మాట అవాస్తవం అన్నమాట.
కాకపోతే... తన క్లాస్ మేట్ తో ప్రేమలో ఉందన్న విషయాన్ని మాత్రం మేనక ఖండించకపోవడం విశేషం. కీర్తి లవ్ లో ఉందన్న విషయం చాలామందికి తెలుసు. కానీ ఎవరూ బయట పెట్టడం లేదు. కీర్తి కూడా ఈమధ్య మీడియా ముందుకు రాలేదు. వస్తే గనుక ప్రేమ - పెళ్లి విషయాలపై కొత్త సంగతులు తెలుస్తాయి. `దసరా` ప్రమోషన్లలో కీర్తి చురుగ్గా పాల్గొనే అవకాశం ఉంది. తను నోరు విప్పితే తప్ప.. ఇవి రూమర్లా? లేదంటే నిజాలా? అనే విషయంలో క్లారిటీ రాదు.