ఉప్పెనతో ఘనమైన ఎంట్రీ ఇచ్చాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. ఈ సినిమా 50 కోట్ల మైలు రాయిని దాటేసింది. అరంగేట్ర సినిమాతోనే 50 కోట్ల క్లబ్ లో చేరిన హీరోగా... వైష్ణవ్ రికార్డు సృష్టించాడు. ఇప్పుడు తన చేతిలో బోలెడన్ని ఆఫర్లున్నాయి. అందులో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఓ సినిమా ఒప్పుకున్నాడు. ఓ కొత్త దర్శకుడ్ని ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ చిత్రంలో కథానాయికగా కితికా శర్మని ఎంచుకున్నారని తెలిసింది.
`రొమాంటిక్` సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కేతిక శర్మ. ఆసినిమా ఇంకా రిలీజ్ కాలేదు. పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించాడు. చిత్రీకరణ పూర్తయింది. ఈసినిమాలోని రషెస్ చూసిన దర్శక నిర్మాతలు కేతికని ఎంపిక చేశారు. త్వరలోనే ఓ అధికారిక ప్రకటన కూడా రానుంది.