వివాదంలో 'కేజీఎఫ్‌ 2': షూటింగ్‌కి బ్రేక్‌.

మరిన్ని వార్తలు

కన్నడ సినిమా సత్తా ఏంటో చూపించిన సినిమా 'కేజీఎఫ్‌'. 'బాహుబలి' తర్వాత ఈ సినిమా గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు. అలా ఓ సరికొత్త ప్రభంజనం సృష్టించింది 'కేజీఎఫ్‌'. 'బాహుబలి'తో ప్రబాస్‌ యూనివర్సల్‌ స్టార్‌ అయిపోయినట్లే, 'కేజీఎఫ్‌'తో హీరో యష్‌ కూడా యూనివర్సల్‌ స్టార్‌డమ్‌ దక్కించుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో, వెంటనే సీక్వెల్‌ని స్టార్ట్‌ చేశారు.

 

తొలి పార్ట్‌కి మించిన భారీ బడ్జెట్‌తో, భారీ అంచనాలతో రెండో పార్ట్‌ తెరకెక్కుతోంది. ప్రస్తుతం కోలార్‌ ఫీల్డ్స్‌లోని సైనైడ్‌ హిల్స్‌లో 'కేజీఎఫ్‌ 2' షూటింగ్‌ జరుగుతోంది. అయితే, ఈ షూటింగ్‌ కారణంగా, అక్కడి వాతావరణానికి హాని కలుగుతోందంటూ, ఆ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కోర్టుకెక్కడంతో, ఇరు వాదనలు విన్న కోర్టు, విచారణలో సదరు వ్యక్తి చెప్పిన కారణాలు బలంగా ఉండడంతో తక్షణమే షూటింగ్‌ వాయిదా వేయాలని 'కేజీఎఫ్‌ 2' టీమ్‌కి ఆదేశాలు జారీ చేసింది. దాంతో తాత్కాలికంగా షూటింగ్‌కి బ్రేక్‌ పడింది.

 

ఈ యాక్షన్‌కి 'కేజీఎప్‌' టీమ్‌ తదుపరి రియాక్షన్‌ ఏంటనేది తెలియాల్సి ఉంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్‌ అగ్రహీరో సంజయ్‌ దత్‌ విలన్‌గా నటిస్తున్నాడు. 'అధీరా' పాత్రలో ఇటీవల విడుదల చేసిన సంజయ్‌ దత్‌ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. తొలి పార్ట్‌లో హీరోయిన్‌గా నటించిన శ్రీనిధి శెట్టి, ఈ సీక్వెల్‌లోనూ యష్‌తో జోడీ కడుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS