బిగ్‌బాస్ థర్డ్ సీజన్లో హౌస్‌లో శ్రీముఖి చేస్తున్న హల్చల్ అంతా ఇంతా కాదు. బుల్లితెర రాములమ్మగా ఈ హల్‌చల్‌ని ముందుగానే ఊహించి, శ్రీముఖిని కంటెస్టెంట్‌గా ఎంపిక చేసుకుంది బిగ్‌బాస్ టీమ్. అంతేకాదు, ఈ సీజన్ బిగ్‌బాస్ విజేత 'శ్రీముఖి' అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది. ఇదిలా ఉంటే, తాజాగా శ్రీముఖిపై కుట్ర జరుగుతోందంటూ ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారట.
అసలింతకీ శ్రీముఖిపై జరుగుతున్న కుట్ర ఏంటీ.? ఆ వివరాల్లోకి వెళితే, బయట మంచి ఫ్రెండ్స్‌గా ఉన్న రాహుల్, శ్రీముఖి హౌస్‌లోకి వెళ్లాక బద్ద శత్రువుల్లా మారిపోయారు. నిజానికి రాహుల్ తప్పేం లేకపోయినా, శ్రీముఖి, రాహుల్ విషయంలో కొంచెం ఎగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తోందనీ, 'బ్లాక్ షీప్' అంటూ రాహుల్‌ని అవమానిస్తోందనీ, ఇంకా చాలా విషయాల్లో రాహుల్‌ని టార్గెట్ చేస్తోందనీ ఈ చర్య మానవీయంగా లేదంటూ కొందరు అభిమానులు సోషల్ మీడియాలో శ్రీముఖిపై చేసిన ట్వీట్‌ని ప్రస్థావిస్తూ, ఓ మీడియా ఛానెల్ కథనం రాసుకొచ్చింది.
ఈ కథనం సారాంశం శ్రీముఖిని బ్యాడ్ చేసేలా ఉండడంతో, సదరు ఛానెల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు శ్రీముఖి బంధువులు. ఈ కథనం శ్రీముఖి ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేలా ఉందనీ, శ్రీముఖిపై కుట్రతోనే ఇలాంటి బ్యాడ్ ప్రచారం జరుగుతోందని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.