ప్ర‌భాస్ తో శ్రుతిహాస‌న్‌?

మరిన్ని వార్తలు

క్రాక్ సూపర్ హిట్ తో మ‌రోసారి తెలుగు ద‌ర్శ‌కుల దృష్టిలో ప‌డింది శ్రుతిహాస‌న్‌. ఇప్పుడు మ‌రిన్ని అవ‌కాశాలు శ్రుతి ముంగిట నిలుస్తున్నాయి. తాజాగా.. ప్ర‌భాస్ సినిమాలోనూ శ్రుతి క‌థానాయిక‌గా చేస్తోంద‌న్న టాక్ మొదలైంది. ప్ర‌భాస్ - ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్ లో `స‌లార్‌` రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఓ క‌థానాయిక‌గా... శ్రుతిహాస‌న్ ని ఎంచుకున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి.

 

ఇటీవ‌ల ప్ర‌శాంత్ నీల్.. శ్రుతిని క‌లిసి క‌థ వినిపించాడ‌ట‌. ప్ర‌భాస్ తో ఛాన్స్ అంటే మాట‌లా? పైగా పాన్ ఇండియా సినిమా. అందుకే శ్రుతి మ‌రో ఆలోచ‌న లేకుండా.. ఈ సినిమాపై సంత‌కాలు చేసేసింద‌ని తెలుస్తోంది. శ్రుతి క‌థానాయిక‌గా న‌టించిన `వ‌కీల్ సాబ్` ఈ వేస‌విలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. `పిట్ట‌క‌థలు` వెబ్ మూవీలోనూ శ్రుతి కీల‌క పాత్ర పోషిస్తోంది. ఫిబ్ర‌వ‌రి 19న `పిట్ట‌క‌థ‌లు` నెట్ ఫిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS