కేజీఎఫ్ చాప్ట‌ర్ 3.. ఈసారి క‌ష్ట‌మేనా?

మరిన్ని వార్తలు

కేజీఎఫ్ 1 సృష్టించిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. ఓ క‌న్న‌డ సినిమా...పాన్ ఇండియా వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. ఇప్పుడు చాప్ట‌ర్ 2 కూడా వ‌చ్చేసింది. ఈ సినిమా కూడా.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర త‌న స‌త్తా చాటుతోంది. అంతే కాదు.. చాప్ట‌ర్ 3 కూడా ఉంద‌ని ద‌ర్శ‌కుడు హింట్ ఇచ్చేశాడు. సో... పార్ట్ 3 చూడ్డానికి కూడా రెడీ అయిపోవ‌చ్చ‌న్న‌మాట‌.

 

అయితే ఈసారి పార్ట్ 3 క‌థ రాసుకోవ‌డం, దాన్ని మెప్పించ‌డం అంత ఈజీ కాదు. పార్ట్ 1లో... రాకీ భాయ్‌... కేజీఎఫ్ సామ్రాజ్యంలోకి ఎలా వెళ్లాడు? అక్క‌డ రాజుగా ఎలా మారాడు? అనేది చూపించారు. పార్ట్ 2లో.. త‌న‌కు ఏ రూపంలో ముప్పు ముంచుకొచ్చిందో.. చూపించారు. మ‌రి పార్ట్ 3 ప‌రిస్థితేంటి? చాప్ట‌ర్ 2 లో.. రాకీ భాయ్ ని చంపేశారు. మ‌రి.. త‌ను తిరిగొస్తాడా? కూలిపోయిన కేజీఎఫ్ సామ్రాజ్యాన్ని మ‌ళ్లీ... చేజిక్కించుకుంటాడా? అనేది క‌థ కావొచ్చు. కాక‌పోతే... మెప్పించ‌డం అంత సుల‌భం కాదు. ఎందుకంటే బ‌ల‌మైన ప్ర‌తినాయ‌కులంద‌రినీ చంపుకుంటూ వెళ్లిపోయాడు. ఇప్పుడు ప్ర‌తినాయ‌కుడే లేడు. వాడ్నీ కొత్త‌గా తీసుకురావాల్సిందే. రెండు భాగాల్లో లేని మ్యాజిక్ ఏదో మూడో భాగంలో చూపించాలి. అదే క‌ష్టం. అన్నింటికంటే ముఖ్యంగా ప్ర‌శాంత్ నీల్ చేతిలో చాలా ప్రాజెక్టులున్నాయి. అవ‌న్నీ అయ్యాకే.. పార్ట్ 3 తీయాలి. కాబట్టి... ఇది ఇప్ప‌ట్లో తేలే వ్య‌వ‌హారం కాదు.

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS