కన్నడ సినిమా సత్తాని దేశానికి పరిచయం చేసిన సినిమా `కేజీఎఫ్`. దర్శకుడు ప్రశాంత్ నీల్ వైపు స్టార్ హీరోలు, నిర్మాతల దృష్టి పడేలా చేసింది. ఇప్పుడు చాప్టర్ 2 కూడా రెడీ అవుతోంది. కేజీఎఫ్ 1 కంటే భారీ హంగులతో, స్టార్ కాస్టింగ్ తో ఈ సినిమా రెడీ అవుతోంది. కేజీఎఫ్ చాప్టర్ 2కి సంబంధించి మంగళవారం ఉదయం పది గంటలకు సర్‌ప్రైజ్ ఇస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది. మంగళవారం సంజయ్‌దత్ పుట్టిన రోజు.
‘కె.జి.యఫ్ చాప్టర్2’లో అధీర పాత్రలో కనిపించనున్నాడు సంజయ్ దత్. ఆ పాత్రకు సంబంధించిన టీజర్ నే మంగళవారం విడుదల చేయనున్నారు. ఈ టీజర్‌ని దక్షిణాదిలోని అన్ని భాషలతో పాటు, హిందీలోనూ విడుదల చేస్తారు. రేపటి టీజర్ తో ఈ సినిమాలోని సంజయ్ పాత్రపై ఓ అంచనాకు రావొచ్చు. కేజీఎఫ్ 2 నుంచి వస్తున్న తొలి అఫీషియల్ టీజర్ ఇదేకాబట్టి.. అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరి అదెలా ఉంటుందో చూడాలి.