ఏటీటీని అడ్డాగా మార్చుకుని సినిమాల మీద సినిమాలు వదులుతున్నాడు రాంగోపాల్ వర్మ. క్లైమాక్స్, నగ్నం, పవర్ స్టార్.. అంటూ ఇప్పటి వరకూ ఓటీటీలో 3 సినిమాలు తీశాడు. ఇప్పుడు మరో మూడు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకూ ఏ సినిమాకీ రాని వసూళ్లు `పవర్ స్టార్`కి వచ్చినట్టు ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. ఈ సినిమాకి 150 రూపాయల టికెట్టు పెట్టాడు వర్మ. ఇది అడ్వాన్డ్ బుకింగ్ వాళ్లకే. సినిమా రిలీజ్ అయ్యాక బుక్ చేసుకుంటే టికెట్ 250 రూపాయలు.
అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే వర్మకి కోటి రూపాయల వరకూ వచ్చిందని టాక్. ఆ తరవాత కూడా.. మంచి వసూళ్లు వచ్చేవే. కానీ.. పైరసీ ప్రింటు అందుబాటులోకి రావడంతో వసూళ్లు బాగా తగ్గిపోయాయి. పైగా ఇది 32 నిమిషాల సినిమా. రూ.250 పెట్టి, 32 నిమిషాల సినిమా చూడడమేంటి? అని ఇంకొంత మంది డ్రాప్ అయిపోయారు. లేదంటే మరిన్ని వసూళ్లు వచ్చేవి. ఈ సినిమాకి వర్మ ఖర్చు పెట్టింది రూ.10 లక్షలు కూడా ఉండదని వినికిడి. అలా.. ఎలా చూసినా... వర్మకి పవర్ స్టార్ వల్ల లాభాలే లాభాలు.