విడుదలకు ముందు... టాక్ ఆఫ్ ది ఇండ్రస్ట్రీగా నిలిచింది `కేజీఎఫ్`. కన్నడలో అత్యధిక బడ్జెట్‌తో రూపొందించిన చిత్రమిది. ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తెలుగులో సరైన థియేటర్లు లభించకపోవడం, ప్రీ రిలీజ్ పబ్లిసిటీ లేకపోవడం ఈ సినిమాకి మైనస్ గా మారాయి. అయితే.. ఓవర్సీస్‌లో మాత్రం ఈ సినిమా దుమ్ము దులుపుతోంది.
అక్కడ విడుదలైన కన్నడ వెర్షన్ వసూళ్లలో దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ..3లక్షల 55 వేల డాలర్లను వసూలు చేసింది. ఓ కన్నడ సినిమా ఈ స్థాయిలో ఓవర్సీస్ వసూళ్లు రాబట్టడం ఇదే రికార్డు. అంతకు ముందు కిర్రాక్ పార్టీ 3 లక్షల 15 వేల డాలర్లు వసూలు చేసింది. ఆ రికార్డుని కేజీఎఫ్ అవలీలగా దాటేసింది.
తెలుగులోనూ ఈ సినిమా పుంజుకున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి రూ.5 కోట్లకు తెలుగులో బిజినెస్ జరుపుకుంది కేజీఎఫ్. ఆ డబ్బులు తిరిగి రాబట్టుకునే ఛాన్సు పుష్కలంగా ఉందని సమాచారం. ఈ వారం విడుదలైన సినిమాల్లో కేజీఎఫ్ మాత్రమే ఇలా తిరిగి పెట్టుబడి సాధించగలుగుతోంది.