రైతుల కష్టాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంత కష్టపడి బంగారం పండిస్తారో, ఆ కష్టానికి ఫలితం దక్కే సమయానికి ఎన్నెన్ని కష్టాలను అనుభవించాల్సి వస్తుందో రైతు. అందుకే జై కిసాన్ అన్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే చిరంజీవి రీ ఎంట్రీలో వస్తోన్న సినిమా 'ఖైదీ నెంబర్ 150'. ఈ సినిమా రైతు జీవితాన్ని, వారి కష్ట నష్టాల్ని తెలియజేసే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలోని పాటలన్నీ ఆడియో సింగిల్స్‌గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇంతవరకూ నాలుగు పాటలు ఈ రకంగానే మార్కెట్‌లోకి వచ్చాయి. అయితే తాజాగా మరో ఆడియో సింగిల్ వచ్చింది. ఈ పాట వింటేనే తెలిసిపోతోంది రైతు కష్టం ఎంతనేది. 'నీరు నీరు నీరు.. రైతు కంట నీరు..చూడనైన చూడరెవ్వరూ అంటూ సాగే ఈ పాట ఎంతటివారినైనా కంటతడి పెట్టనివ్వక మానదు. ఇంత వయసులో చిరంజీవి చేసేది ఓ మాస్ సినిమా. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే ఉండే సినిమా అనుకున్నాం కదా. ఇప్పుడు మన ఆలోచన మార్చుకుని తీరాల్సిందే. ఎందుకంటే కష్టాల పాలైన రైతులను ఆదుకునేందుకు వచ్చిన ఖైదీగా ఈ సినిమాలో చిరంజీవి పాత్ర ఉండబోతోందట. వినాయక్ చిరంజీవిని ఎంత పవర్‌ఫుల్‌గా చూపించి ఉంటాడో ఈ సినిమాలో. రామ్ చరణ్ నిర్మాణంలో వస్తోన్న మొదటి సినిమా ఇది. చందమామ బ్యూటీ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.