లాస్యా నీ లుక్‌ కేక

మరిన్ని వార్తలు

బుల్లితెరపై యాంకర్‌గా పేరు తెచ్చుకున్న లాస్య సడెన్‌గా బుల్లితెరపై మాయమైపోయింది. ఇప్పుడు వెండితెరపై ప్రత్యక్షమయ్యింది. అదీ హీరోయిన్‌గా. 'రాజా మీరు కేక' టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా సినిమాకి సంబంధించిన పోస్టర్‌ విడుదలయ్యింది. బుల్లితెరపై మాయమైపోయిన లాస్య ఏమైంది? రవితో లాస్యకున్న వివాదాలేంటి. అంటూ రకరకాలుగా చర్చించుకున్నారు. కానీ వాటికి ఆన్సర్‌ మాత్రం దొరకలేదు. ఇటీవల యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌తో లాస్యకు పెళ్లయిపోయిందంటూ గాసిప్స్‌ కూడా వచ్చాయి. తాజాగా కొన్ని గాసిప్స్‌కి లాస్య స్పందించింది కూడా. సెలబ్రిటీస్‌ అన్నాక గాసిప్స్‌ కామనే. కానీ మరీ సెలబ్రిటీస్‌ని బాధించే గాసిప్స్‌ని దయచేసి క్రియేట్‌ చేయొద్దు అంటూ లాస్య రెస్పాండ్‌ అయ్యింది. మొత్తానికి లాస్య బుల్లితెరపై మాయమైన దాని వెనుక పెద్ద స్టోరీనే ఉందన్న మాట. అనూహ్యంగా హీరోయిన్‌గా ప్రత్యక్షమవ్వడంతో ఇంతవరకూ తనపై వచ్చిన గాసిప్స్‌ అన్నీ కొట్టుకుపోయాయి. కృష్ణ కిషోర్‌.టి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'గుంటూర్‌ టాకీస్‌' సినిమాకి నిర్మాణం వహించిన రాజ్‌ కుమార్‌. ఎమ్‌ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పోస్టర్‌లో లాస్య చాలా బాగుంది. బుల్లితెరపై చీమ, ఏనుగు కథలు చెప్పుకునే లాస్య వెండితెరపై చాలా మెచ్యూర్డ్‌ లుక్‌లో కనిపిస్తోంది. 


 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS